Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్వంటీ20: సైమోపై వేటు

Andrew Symonds
లండన్‌: క్రమశిక్షణ పాటించనందుకు ఆండ్ర్యూ సైమోను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ట్వంటీ20 వరల్డ్‌ కప్‌ జట్టు నుంచి తప్పించింది. టీ20 వరల్డ్‌ కప్‌ లో శనివారం వెస్టిండీస్‌ తో ఆసీస్‌ తొలిమ్యాచ్‌ ఆడనుండగా సైమోపై వేటువేయడం గమనార్హం. జట్టు నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించినందుకే అతనిపై క్రమశిక్షణ చర్య తీసుకున్నట్లు సీఏ సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ స్పష్టంచేశాడు. "గురువారం సాయంత్రం సైమో స్వదేశానికి చేరుకుంటాడు. గత 24 నుంచి 48 గంటల వ్యవధిలో గణనీయ సంఖ్యలో అతను జట్టు నిబంధనలను ఉల్లంఘించాడు. అదే విషయాన్ని అతనికి చెప్పాం. అతను ఉల్లంఘించిన నిబంధనలు తీవ్రమైనవి కాకపోవచ్చు కానీ మా ప్రణాళికలు, గత చరిత్ర పరిగణలోకి తీసుకుంటే అతనిపై వేటు సరైందే. జట్టు మేనేజ్‌మెంట్‌ సూచనల మేరకే సీఏ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. సైమోపై చర్యకు అతని పరిస్థితికి నిరాశ చెందుతున్నా. అతనిపై వేటుకు మద్యం సంబంధిత అంశాలే కారణం. అతని స్థానంలో మరో ఆటగాడిని ఆడించాలని నిర్ణయించాం. ఈ విషయంలో ఐసీసీ మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం" అని సదర్లాండ్‌ చెప్పాడు. సైమోకు సీఏ బాసటగా నిలుస్తుందని తెలిపారు.

సైమోకు మా పూర్తి మద్దతు ఉంటుందని, అతను మళ్ళీ గాడిన పడేందుకు అన్నివిధాలుగా ప్రోత్సహిస్తాం అని ఆయన చెప్పారు. ఐతే అతనితో ఉన్న సెంట్రల్‌ కాంట్రాక్టును సమీక్షిస్తామని స్పష్టంచేశారు. బుధవారం రాత్రి పీసీఏ డిన్నర్‌కు హాజరైన సైమో గురువారం ఉదయం ఓవల్‌ మైదానంలో ఆసీస్‌ ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరుకాలేదు. అతని గురించి ఆరా తీయగా ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరుకావొద్దని సీఏ అతణ్ణి ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకొని సీఏ ఆగ్రహానికి గురైన సైమో చివరి అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. వివాదాలతో జట్టుకు దూరమైన అతణ్ణి ఇటీవల పాకిస్థాన్‌తో సిరీస్‌ కు ఎంపిక చేశారు. అయినా అతనిపై ఓ కన్నేసి ఉంచినట్లు సదర్లాండ్‌ బహిరంగంగా వ్యాఖ్యానించాడు. మళ్ళీ అతను తప్పు చేస్తే సెంట్రల్‌ కాంట్రాక్టును రద్దు చేసుకుంటామని అప్పుడు స్పష్టంచేశాడు. సదర్లాండ్‌ ఆ వ్యాఖ్యలు చేసి నెల రోజుల కూడా గడవక ముందే సైమో మద్యం వివాదంతో చిక్కుకొని క్రమశిక్షణ చర్యకు గురికావడం గమనార్హం.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+