Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్ట్రీకర్ పై దాడి: సైమండ్స్ కు విముక్తి

Symonds
బ్రిస్బేన్: స్ట్రీకర్ పై దాడి చేసిన సంఘటనలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్ పై ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదు. బ్రిస్బేన్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం జరిగిన రెండో ఫైనల్ వన్డే మ్యాచ్ సందర్భంగా ఒక స్ట్రీకర్ మైదానంలోకి దూసుకొచ్చాడు. నగ్నంగా మైదానంలోకి దూసుకొచ్చిన ప్రేక్షకుడి సైమండ్స్ భుజంతో ఢీకొట్టాడు. అనంతరం భద్రతా పోలీసులు అతన్ని పట్టుకుని తీసుకెళ్లారు.

ఆత్మరక్షణ కోసమే సైమండ్స్ అలా చేశాడని, సైమండ్స్ కు తమ మద్దతు ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి మైకెల్ బ్రౌన్ అన్నారు. తాను తప్పు చేశానని 26 ఏళ్ల స్ట్రీకర్ ఒగిల్వే బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు అంగీకరించాడు. క్రీడలో నిమగ్నమైన వ్యక్తుల మధ్య జోక్యం చేసుకున్నందుకు, కావాలని నగ్న ప్రదర్శన చేసినందుకు అతను తన తప్పును ఒప్పుకున్నాడు. జుర్మానా విధించి అతన్ని కోర్టు వదిలేసింది. సైమండ్స్ పై తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని, అందువల్ల కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఐసిసి నియమావళి ప్రకారం ప్రేక్షకులపై దాడి చేసిన క్రికెటర్ పై చర్యలు తీసుకుంటారు. సైమండ్స్ పై జీవిత కాలం నిషేధం విధించవచ్చుననే వార్తలు కూడా వచ్చాయి.
Story first published: Wednesday, March 5, 2008, 15:00 [IST]
Other articles published on Mar 5, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+