సైమండ్స్ అజేయ సెంచరీ:ఆసీస్ 376/7

సిడ్నీ:అండ్రూ సైమండ్స్ అద్భుతమైన సెంచరీ చేయడంతో సిడ్నీలో బుధవారం ప్రారంభమైన రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి 376 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అండ్రూ సైమండ్స్ 137 పరుగులతోను, బ్రెట్ లీ 31 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రికీ పాంటింగ్ అంచనాలను తలకిందులు చేస్తూ భారత బౌలర్లు విజృంభించారు. జహీర్ ఖాన్ స్థానంలో వచ్చిన ఆర్.పి.సింగ్ ఆదిలోనే ఆస్ట్రేలియాపై గట్టి దెబ్బతీశాడు. ఆసీస్ జట్టు స్కోరు 1 ఉండగానే ఓపెనర్ జాక్వెస్(0) ను పెవిలియన్ పట్టేలా చేశాడు. మరికొద్ది సేపటికే మరో ఓపెనర్ హెడెన్(13)ను కూడా ఆర్పీ సింగ్ అవుట్ చేశాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 27 పరుగులు. అనంతరం వచ్చిన హస్సీ(41)తో కలిసి కెప్టెన్ రికీ పాంటింగ్ (55) జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. జట్టు స్కోరును 100 పరుగులను ధాటించారు.
నిలకడగా ఆడుతున్నారనుకుంటుండగా 119 పరుగుల వద్ద వీరిద్దరూ వెంటవెంటనే పెవిలియన్ దారి పట్టారు. పాంటింగ్ ను హర్భజన్ సింగ్ అవుట్ చేయగా, హస్సీని ఆర్పీ అవుట్ చేశాడు. ఆ వెంటనే క్లార్క్(1)ను హర్భజన్, గిల్ క్రస్ట్(7)ను ఆర్పీ అవుట్ చేశాడు. అప్పటికీ ఆసీస్ జట్టు స్కోరు 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే. ఇక ఆసీస్ పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో వచ్చిన బ్రాడ్ హాగ్ తో కలిసి అప్పటికే క్రీజ్ లో కుదురుగా ఆడుతున్న అండ్రూ సైమండ్ ఏడవ వికెట్ భాగస్వామ్యంలో రికార్డు స్థాయిలో 173 పరుగులు జోడించి భారత జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. మొత్తానికి బ్రాడ్ హాగ్(79)ను భారత జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే అవుట్ చేసినప్పటికీ ఆసీస్ స్కోరు 300 పరుగుల మైలురాయి దాటింది. బ్రాడ్ హాగ్ స్థానంలో వచ్చిన బ్రెట్ లీ కూడా హాగ్ లాగే భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి అభేద్యమైన ఎనిమిదవ వికెట్ భాగస్వామ్యంలో 69 పరుగులు జోడించారు. 137 పరుగులు చేసి అజేయంగా నిలిచి భారత్ పాలిట విలన్ గా మారిన అండ్రూ సైమండ్స్ 2 సిక్స్ లు 17 ఫోర్లు కొట్టి తన సత్తా చాటాడు. మాటల్లో కాకుండా మరోమారు చేతల్లో తానేమిటో నిరూపించాడు. ఆసీస్ జట్టును తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే ఆర్పీ సింగ్ 4వికెట్లు, హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా అనిల్ కుంబ్లే ఒక వికెట్ పడగొట్టాడు.
Story first published: Wednesday, January 2, 2008, 14:37 [IST]
Other articles published on Jan 2, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications