Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను క్షమించండి: సైమండ్స్

Andrew Symonds
మెల్బోర్న్: తాను చేసిన తప్పులకు క్షమాపణలు కోరుతున్నట్లు ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్ర్యూ సైమండ్స్ తెలిపారు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయిన సైమండ్స్ తిరిగి తాను జట్టులోకి రాగలననే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. జట్టు సమావేశాన్ని కాదని చేపలు పట్టేందుకు వెళ్లడంతో సైమండ్స్ ను బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. అలాగే భారత పర్యటనకు వెళ్లే ఆస్ట్రేలియా జట్టులో కూడా స్థానం కోల్పోయారు.

తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, ఉత్తమ క్రికెటర్ గానే కాకుండా ఉత్తమ వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు. క్వీన్స్ లాండ్ తరఫున అడుతున్న సైమండ్స్ తమ జట్టు శిక్షణా కార్యక్రమం సందర్భంగా బ్రిస్బేన్ లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తన క్లబ్, రాష్ట్రం, దేశం తరఫున క్రికెట్ ఆడడాన్ని సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను చేసిన చిన్నపాటి తప్పులకు తాను క్షమాపణలు కోరుతున్నానని, తాను ఉత్తమ వ్యక్తిగా ముందుకు రాగలనని నమ్ముతున్నానని, భవిష్యత్తులో తప్పులు చేయబోనని సైమండ్స్ అన్నారు.
Story first published: Tuesday, September 16, 2008, 15:30 [IST]
Other articles published on Sep 16, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+