
హైదరాబాద్: సయ్యద్ ముస్థఖ్ అలీ ట్రోఫీలో భాగంగా సోమవారం హైదరాబాద్ జట్టు కేరళ జట్టుతో తలపడింది. ఈ పోటీలో తన అసమాన ప్రతిభను చూపించిన కెప్టెన్ అంబటి రాయుడు (52 నాటౌట్; 31 బంతుల్లో 3శ్రీ4, 2శ్రీ6) సత్తాచాటడంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 10 పరుగుల ఆధిక్యంతో కేరళపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం కేరళ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ సచిన్ బేబి (79; 50 బంతుల్లో 7శ్రీ4, 2శ్రీ6) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ (2/28), రవికిరణ్ (3/28) రాణించారు.
హైదరాబాద్: 168/5 (అక్షత్‌రెడ్డి 34, సందీప్ 25, రాయుడు 52 నాటౌట్, ఆశిష్‌రెడ్డి 21 నాటౌట్, సుమంత్ 18 నాటౌట్)
కేరళ: 158/7 (సచిన్ బేబి 79, సిరాజ్ 2/28, రవికిరణ్ 3/28)
ఆంధ్రాని అధిగమించిన తమిళనాడు
ఇదే టోర్నీలో ఆంధ్రాకు చుక్కెదురైంది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో ఆంధ్రాను ఓడించింది. తొలుత ఆంధ్రా 20 ఓవర్లలో 7 వికెట్లకు 119 పరుగులు చేసింది. బదులుగా తమిళనాడు 14.4 ఓవర్లలో 3 వికెట్లకు 122 పరుగులు సాధించింది.
తమిళనాడు: 122/3 (దినేశ్ కార్తీక్ 57)
ఆంధ్ర: 119/7 (రిక్కీ భుయ్ 25)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.