కర్ణాటకదే 'ముస్తాక్ అలీ': ఫైనల్లో మహారాష్ట్రపై 8 వికెట్ల తేడాతో విజయం

హైదరాబాద్: ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 85 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. నౌషద్ షేక్ (41 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ రాహుల్ త్రిపాఠీ (32 బంతుల్లో 30; 3 ఫోర్లు), అంకిత్ బావ్నే (25 బంతుల్లో 29; 4 ఫోర్లు) పరుగులతో ఫరవాలేదనిపించారు.

తొలి వికెట్‌కు 35 పరుగులు
కెప్టెన్ రాహుల్, రుత్‌రాజ్ గైక్వాడ్ (12) తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరితో పాటు విజయ్ జోల్ (8) కూడా ఔట్ కావడంతో మహారాష్ట్ర రన్‌రేట్ 10 ఓవర్లదాకా ఆరు పరుగులను మించలేకపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నౌషద్ షేక్ ధాటిగా ఆడటంతో ఆ తర్వాత మహారాష్ట్ర స్కోరులో వేగం పుంజుకుంది.

నాలుగో వికెట్‌కు 81 పరుగులు
అంకిత్ బావ్నే (29; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. అయితే పేసర్ అభిమన్యు మిథున్ (2/24) చెలరేగి గైక్వాడ్‌ను ఔట్ చేయడంతో పరుగుల వేగం మందగించింది. వరుస విరామాల్లో విజయ్ జోల్ (8), త్రిపాఠి కూడా వెనుదిరగడంతో మహారాష్ట్ర 55 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది.

మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ
కర్ణాటక బౌలర్లలో అభిమన్యు మిథున్ రెండు, కేసీ కరియప్ప, జగదీష్‌లు తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో కర్ణాటక 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. మయాంక్ అగర్వాల్ (85 నాటౌట్), రోహన్ ప్రమోద్ (60) హాఫ్ సెంచరీలతో రాణించారు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ శరత్ (2) ఔటైనా.. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడారు.

పటిష్ట స్థితిలో కర్ణాటక
వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఈ జోడీ తేలిగ్గా ఆడేసింది. దీంతో ఓవర్‌కు సగటున 8 పరుగులు సాధిస్తూ లక్ష్యం దిశగా సాగింది. ఓ దశలో 12 ఓవర్లలో 106/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచిన కర్ణాటక గెలువడానికి మరో 50 పరుగులు చేయాల్సిన దశలో రోహన్ వికెట్‌ను కోల్పోయింది.

ఏమాత్రం నిరాశ చెందని మయాంక్
అయినా ఏమాత్రం నిరాశ చెందని మయాంక్.. కరుణ్ నాయర్ (8 నాటౌట్) అండతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మహారాష్ట్ర బౌలర్లలో సమద్ ఫలా, దివ్యాంగ్ చెరో వికెట్ తీశారు. మయాంక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టీ20 ఫార్మాట్‌లో కర్ణాటక జట్టుకు ఇది వరుసగా 14వ విజయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications