Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే

ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 సీజన్ నాకౌట్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం విడుదల చేసింది. జనవరి 26, 27 తేదీల్లో క్వార్టర్​ ఫైనల్స్, 29న సెమీ ఫైనల్స్​, 31న ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. అన్ని మ్యాచ్​లు కొత్తగా నిర్మించిన అహ్మదాబాద్​లోని మొతెరాలోని సర్దార్ పటేల్ మైదానంలో జరగనున్నాయి.

కరోనా నేపథ్యంలో బయో‌ బబుల్ మధ్య జనవరి 10న ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్ 1లో కర్ణాటక, పంజాబ్ తలపడనుంగా.. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ పోటీపడనున్నాయి. క్వార్టర్ ఫైనల్-3లో హరియాణాతో బరోడా, క్వార్టర్ ఫైనల్-4లో బిహార్‌తో రాజస్థాన్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇక ఈ సీజన్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, ఆంధ్ర జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి.

షెడ్యూల్..

జనవరి 26న క్వార్టర్ ఫైనల్​1: కర్ణాటక X పంజాబ్

జనవరి 26న క్వార్టర్ ఫైనల్​2: తమిళనాడు X హిమాచల్ ప్రదేశ్

జనవరి 27న క్వార్టర్ ఫైనల్​3: హరియాణా X బరోడా

జనవరి 27న క్వార్టర్ ఫైనల్​4: బిహార్ X రాజస్థాన్

జనవరి 29

సెమీస్​ 1: క్వాలిఫైయర్​2 విన్నర్ X క్వాలిఫైయర్ ​4

సెమీస్ 2 : క్వాలిఫైయర్​1 విన్నర్ X క్వాలిఫైయర్​3

జనవరి 31 ఫైనల్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, January 22, 2021, 17:41 [IST]
Other articles published on Jan 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X