For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

61 బంతుల్లో సెంచరీ: నాలుగో బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు

Pujara Slams Maiden T20 Century Off 61 Balls in Syed Mushtaq Ali Trophy | Oneindia Telugu
Syed Mushtaq Ali T20 Trophy: Cheteshwar Pujara smashes 61-ball 100; joins Rohit Sharma, Virender Sehwag in elite list

హైదరాబాద్: 'టెస్టు బ్యాట్స్ మన్' అనే ముద్ర ఉండటంతో ఐపీఎల్ 2019 సీజన్ కోసం గత డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో పూజారా టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా కేవలం 61 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పుజారా ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. పుజారా సెంచరీ సాధించడంతో సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పుజారా మొత్తం 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో తనపై ఉన్న టెస్ట్ స్పెషలిస్ట్ ముద్రను పుజారా తొలగించుకున్నాడు. అంతేకాదు సౌరాష్ట్ర తరుపున టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా పుజారా అరుదైన గుర్తింపు పొందాడు.

అంతేకాదు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్ కావడం విశేషం. అంతకముందు వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పుజారా రాబిన్ ఊతప్ప(31 బంతుల్లో 46)తో కలిసి 82 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Story first published: Thursday, February 21, 2019, 15:44 [IST]
Other articles published on Feb 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+