ముంబై: 2015 సంవత్సరానికి గాను కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకి టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణిని బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు ముంబైలోని క్రికెట్ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశమైన కల్నల్ సీకే నాయుడు అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ ఒక మీడియా ప్రకటనలో పేర్కొంది.
65 ఏళ్ల సయ్యద్ కిర్మాణి 1976 నుంచి 1986 మధ్యకాలంలో భారత్ తరుపున 88 టెస్టులు, 49 వన్డేలకు ప్రాతినిథ్యం వహించారు. అక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సయ్యద్ కిర్మాణి టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సయ్యద్ కిర్మాణి సభ్యుడిగా ఉన్నారు.
భారతీయ క్రికెట్ అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ ఆటగాళ్లకు బీసీసీఐ కల్నల్ సీకే నాయుడు అవార్డుని ప్రతి ఏడాది అందిస్తుంది. ఈ అవార్డు కింద ఒక ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల చెక్‌ను బహుమతిగా అవార్డుకి ఎంపికైన వారికి అందిస్తారు.

గతంలో ఈ అవార్డుని అందుకున్న ఆటగాళ్లు:
1994 - Lala Amarnath
1995 - Syed Mushtaq Ali
1996 - Capt. Vijay Hazare
1997 - K.N. Prabhu
1998 - P. R. Umrigar
1999 - Col. Hemachandra Adhikari
2000 - Subhash Gupte
2001 - Mansoor Ali Khan Pataudi
2002 - Bhausaheb Nimbalkar
2003 - Chandrakant Borde
2004 - Bishan Singh Bedi, BS Chandrasekhar, EAS Prasanna, S Venkataraghvan
2007 - Nariman Contractor
2008 - Gundappa Viswanath
2009 - Mohinder Amarnath
2010 - Salim Durani
2011 - Ajit Wadekar
2012 - Sunil Gavaskar
2013 - Kapil Dev Nikhanj
2014 - Dilip Vengsarkar
తెలుగు వన్ఇండియా