Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League: బిగ్ బాష్ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్..!

Sydney Thunder got all out for 15 against Adelaide Strikers

బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అతి చెత్త రికార్డును సిడ్నీ థండర్స్ జట్టు మూట గట్టుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మ్యాచులో కేవలం 15 పరుగులకే ఆ టీం ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై అడిలైడ్ బ్యాటర్లు తడబడ్డారు. క్రిస్ లిన్ (36), కాలిన్ డి గ్రాండ్‌హోం (33) మాత్రమే కొంత ఫర్వాలేదనిపించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

లక్ష్య ఛేదనలో సిడ్నీకి అనూహ్యమైన ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (0), మాథ్యూ గిల్క్స్ (0) ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన రైలీ రూసో (3) కూడా రాణించలేదు. మరుసటి బ్యాటర్ జేసన్ సంఘా (0) కూడా డకౌట్ అయ్యాడు. ఆ జట్టు బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం ఐదు పరుగులు చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు కనీసం పవర్ ప్లే కూడా ముగియకముందే 5.5 ఓవర్లలో 15 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.

బిగ్ బాష్ లీగ్ సీనియర్ డివిజన్లో ఇంత తక్కువ స్కోరుకు ఒక జట్టు ఆలౌట్ అవడం ఇదే తొలిసారి. అడిలైడ్ బౌలర్లలో హెన్రీ థార్న్‌టన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. వెస్ అగర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వీరిద్దరితోపాటు మాట్ షార్ట్ కూడా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన థార్న్‌టన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ చూసిన సిడ్నీ అభిమానులు తమ జట్టు ఇంత చెత్తగా ఆడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంట్రా ఈ ఆట అంటూ మండి పడుతున్నారు.

Story first published: Friday, December 16, 2022, 18:08 [IST]
Other articles published on Dec 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+