Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'స్మిత్‌ ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. ఏ క్షణమైనా విరుచుకుపడొచ్చు'

Sydney Test: Tom Moody says Steve Smith is caged lion ready to burst out
#INDVSAUS3rdTest Day1 Highlights: Smith, Labuschagne, Pucovski Star As Australia Dominate In Sydney

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ ‌స్మిత్‌ ఆకలిగొన్న సింహమని ఆ జట్టు మాజీ ఆటగాడు టామ్ ‌మూడీ పేర్కొన్నాడు. స్మిత్ ఏ క్షణమైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాడన్నాడు. టీమిండియాపై రెండు టెస్టుల్లో విఫలమైన స్మిత్.. మూడో టెస్టులో కచ్చితంగా రాణిస్తాడని మూడీ అంచనా వేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో అతడు 10 రన్స్ మాత్రమే చేశాడు. స్మిత్ టెస్టుల్లో తొలిసారి భారత జట్టు చేతిలో డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడిలా ఔటవ్వడం అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే తొలిసారి.

తొలి టెస్టులో 2 రన్స్

తొలి టెస్టులో 2 రన్స్

పరిమిత ఓవర్ల క్రికెట్లో 60కి పైగా బంతుల్లోనే రెండు సెంచరీలు బాదేసిన స్టీవ్ ‌స్మిత్‌ సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం తెగ ఇబ్బంది పడుతున్నాడు. భారత్ అతడిని తెలివిగా బుట్టలో పడేస్తోంది. డే/నైట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 29 బంతులు ఎదుర్కోన్న ‌స్మిత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఆఫ్ స్టంప్‌ లైన్‌పై విసిరిన బంతిని ముందుకు ఫుష్ చేయబోయి.. స్లిప్‌లో ఫీల్డర్ అజింక్య రహానే చేతికి చిక్కాడు. బంతిని టర్న్ చేయకుండా అశ్విన్ విసరగా.. స్మిత్ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచి రహానే చేతిలో పడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న స్మిత్.. నాటౌట్‌గా నిలిచాడు. అప్పటికే ఆసీస్ విజయాన్ని అందుకుంది.

రెండో టెస్టులో డకౌట్

రెండో టెస్టులో డకౌట్

రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్.. ఆర్ అశ్విన్ మాయాజాలానికి మరోసారి చిక్కాడు. 15వ ఓవర్ మూడో బంతికి చేటేశ్వర్ పుజారా క్యాచ్ పట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ ముగిసింది. 8 బంతులు ఎదుర్కొన్న స్మిత్ డకౌట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుత బంతికి బోల్డ్ అయ్యాడు. 30 బంతుల్లో 8 పరుగులకు ఔట్ అయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో స్మిత్ 10 రన్స్ మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. దాంతో స్మిత్‌, ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే టామ్ ‌మూడీ అతడికి అండగా నిలిచాడు.

 పరుగులు బాకీ పడ్డాడు

పరుగులు బాకీ పడ్డాడు

తాజాగా టామ్ ‌మూడీ మాట్లాడుతూ... 'ఒకసారి స్టీవ్ స్మిత్‌ రికార్డులు పరిశీలించండి. అతడు పరుగులు బాకీ పడ్డాడు. ఆకలిగొన్న సింహంలా.. ఏ క్షణమైనా విరుచుకుపడేలా కనిపిస్తున్నాడు. కొత్త సంవత్సరంలో పరుగులు చేయాలని అతడిని మించి మరొకరు పట్టుదల ప్రదర్శించలేరు. కేన్ విలియమ్సన్‌, విరాట్ కోహ్లీ, స్మిత్‌ గురించి ఎవరు గొప్ప అని ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. అలాంటి సంభాషణల్లో తన పేరు ఎప్పటికీ ఉండాలని అతడు కచ్చితంగా కోరుకుంటాడు' అని అన్నాడు.సిడ్నీ వేదికగా గురువారం మూడో టెస్టు ప్రారంభం అయింది. స్మిత్ ఇంకా క్రీజులోకి దిగలేదు.

Sydney Test: టెస్టు క్రికెట్‌లో తొలిసారి విధులు.. అప్పుడే వార్నర్‌కు వార్నింగ్ ఇచ్చిన మహిళా అంపైర్!!

Story first published: Thursday, January 7, 2021, 11:36 [IST]
Other articles published on Jan 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+