Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీ వేదికగా కోహ్లీకి మరోసారి పరాభవం, గౌరవించాలని కోరుతున్న పాంటింగ్

Sydney Test: Kohli booed again, Ponting says show some respect to India captain

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా దూకుడుపై పరుగులు సాధిస్తున్నా.. పరాభవాలు మాత్రం తప్పడం లేదు. జాతి వివక్ష ఆరోపణలు చేస్తూ.. హేళన చేస్తున్నారు ఆసీస్ అభిమానులు. రెండో టెస్టు జరగుతున్న సమయంలో పెర్త్ వేదికగా ఆరంభమైన హేళనలు నాలుగో టెస్టు వరకూ కొనసాగాయి. మెల్‌బౌర్న్ స్టేడియంలో సొంత బౌలర్‌ మిచెల్‌ మార్ష్‌ను సైతం హేళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే సిడ్నీ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో మరోసారి కోహ్లీని టార్గెట్ చేశారు ఆసీస్ అభిమానులు.

 ఆస్ట్రేలియా అభిమానులు గేలి చేయడంతో

ఆస్ట్రేలియా అభిమానులు గేలి చేయడంతో

గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 112 బంతులు ఆడి 77 పరుగులు చేశాడు. లయన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వస్తున్న కోహ్లీని చూసి సిడ్నీ స్టేడియంలోని అభిమానులు అరవడం మొదలుపెట్టారు. ఇలా మరోసారి భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు గేలి చేయడంతో అయితే అభిమానుల ప్రవర్తనను మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తప్పుబట్టాడు.

 అలా జరిగితే అవమానకరంగా భావిస్తా

అలా జరిగితే అవమానకరంగా భావిస్తా

‘అతనిపై అభిమానం ఉండి అరిస్తే పరవాలేదు. అలా కాకుండా అవమానకరంగా అరిస్తే మాత్రం సహించను. నిజంగానే ఎస్‌సీజీలో అలా జరిగితే అవమానకరంగా భావిస్తాను. ఇప్పటికే నేను పెర్త్‌ టెస్టులో జరిగిన దానిపై తప్పంటూ సూచించాను. టీమిండియా కెప్టెన్ కోహ్లీని గౌరవించడం నేర్చుకోండి' అంటూ పాంటింగ్‌ అభిమానులకు సూచించాడు.

మీ వీసాలు చూపించండి అంటూ హాహాకారాలు

మీ వీసాలు చూపించండి అంటూ హాహాకారాలు

భారత క్రికెటర్లను మీ వీసాలు చూపించండి అంటూ హాహాకారాలు చేస్తున్న వీడియోను చూపించి స్టేడియం మేనేజ్‌మెంట్ పోలీసులతో హెచ్చరికలు పంపిందట. మర్యాదగా నడుచుకోవాలని లేదంటూ తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిందట. బాక్సింగ్ డే టెస్టు జరుగుతోన్న మెల్‌బౌర్న్‌ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారేం కాదు. 2005లోనూ బాక్సింగ్ డే టెస్టు జరుగుతున్న సమయంలో ఇలానే దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆండ్రి నెల్‌పై వ్యాఖ్యలు చేశారట.

మిచెల్‌ మార్ష్‌ను ఎంపిక చేయడంపై

మిచెల్‌ మార్ష్‌ను ఎంపిక చేయడంపై

ఆస్ట్రేలియా క్రికెటర్‌కు సైతం స్వదేశంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ను ప్రేక్షకులు రెండుసార్లు హేళన చేశారు. స్థానిక ప్లేయర్‌ పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌ స్థానంలో మార్ష్‌ను మూడో టెస్టుకు ఎంపిక చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మిచెల్‌ బౌలింగ్‌కు దిగుతున్నట్టు స్టేడియంలో ప్రకటించిన సందర్భంలో ఒక్కసారిగా ప్రేక్షకులు అరుస్తూ ఎగతాళిగా ప్రవర్తించారు. ఎంసీజీ ప్రేక్షకుల తీరు దారుణమని.. తమను ఎంతో బాధించిందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ అన్నాడు.

1
43626
Story first published: Friday, January 4, 2019, 13:13 [IST]
Other articles published on Jan 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+