Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sydney Test: బర్స్న్‌ అవుట్‌.. వార్నర్‌, పకోస్కీ ఇన్!! ఆస్ట్రేలియా జట్టు ఇదే!

Sydney Test: David Warner and Will Pucovski returns to Australia squad, Joe Burns out

సిడ్నీ: భారత్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు బుధవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును ప్రకటించింది. 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సీఏ ఎంపిక చేయగా.. స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌, పేసర్ సీన్‌ అబాట్‌, యువ ఆటగాడు విల్‌ పకోస్కీలు మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్ చేతిలో రెండో టెస్టులో ఓటమిపాలైన ఆస్ట్రేలియా తమ లోపాల్ని సరిదిద్దుకునే పనిలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన ఓపెనర్‌ జో బర్న్స్‌ను జట్టు నుంచి తొలగించింది. బర్న్స్‌ అడిలైడ్‌ టెస్టులో 8, 51 పరుగులు.. బాక్సింగ్ డే టెస్టులో 0, 4 పరుగులు చేశాడు.

 వార్నర్‌, పకోస్కీ ఇన్

వార్నర్‌, పకోస్కీ ఇన్

డేవిడ్ వార్నర్‌ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, సిడ్నీ టెస్టులో బరిలోకి దిగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆస్ట్రేలియా జట్టు సెలెక్టర్‌ ట్రెవర్‌ హోన్స్‌ తెలిపాడు. సీన్‌ అబాట్‌ ఫిట్‌నెస్ సాధించాడని, పకోస్కీకికు కంకషన్‌ లక్షణాలు లేవని చెప్పాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో అబాట్, విల్ గాయపడగా.. రెండో వన్డేలో వార్నర్‌ గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు వార్నర్‌-పకోస్కీ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని ప్రచారం సాగింది. అయితే వారిద్దరు గాయాలపాలవ్వడంతో మాథ్యూ వేడ్, జో బర్న్స్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.

వార్నర్‌పైనే ఆసీస్‌ ఆశలు

వార్నర్‌పైనే ఆసీస్‌ ఆశలు

టాప్‌ ఆర్డర్‌లో కీలకమైన డేవిడ్ వార్నర్‌పైనే ఆసీస్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. వార్నర్‌ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వార్నర్‌తో కలిసి విల్ పకోస్కీ మూడో టెస్టులో ఓపెనింగ్ చేయనున్నాడు. మాథ్యూ వేడ్ తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. వార్నర్ రాకతో ఆసీస్ బ్యాటింగ్ విభాగం పటిష్టం కానుంది. 22 ఏళ్ల పకోస్కీ.. షెఫీల్డ్ షీల్డ్‌ టోర్నీలో విక్టోరియా జట్టు తరఫున ఆడి వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు చేశాడు. మరి భారత్‌తో జరిగే టెస్టుల్లో ఎలా ఆడతాడో చూడాలి. ఇక బర్స్న్‌ బ్రిస్బేన్‌ హీట్‌ జట్టులో చేరుతాడని సెలక్టర్‌ ట్రెవర్‌ హాన్స్‌ చెప్పాడు.

7న మూడో టెస్టు ప్రారంభం

7న మూడో టెస్టు ప్రారంభం

మరోవైపు భారత జట్టులో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 2020లో గాయంతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లోని రెండు మ్యాచులకు దూరమయిన ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని ఈరోజే జట్టులోకి వచ్చాడు. దీంతో ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారిలో ఒకరిపై వేటుపడనుంది. ఇక నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో విజయంతో సమంగా నిలిచారు. సిడ్నీ వేదికగా జనవరి 7న మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా జట్టు

ఆస్ట్రేలియా జట్టు

డేవిడ్ వార్నర్‌, విల్‌ పకోస్కీ, మార్కస్ హారిస్‌, మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రేవిస్‌ హెడ్, మాట్ హెన్రిక్స్‌, టిమ్‌ పైన్ (కెప్టెన్‌), పాట్ కమిన్స్‌, కెమెరాన్‌ గ్రీన్‌, సీన్ అబాట్‌,నాథన్‌ లైయన్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, జోష్ హేజిల్‌వుడ్‌, జేమ్స్ ప్యాటిన్సన్‌, మైఖేల్‌ నాజర్‌.

India vs Australia: రోహిత్ వచ్చేశాడు.. గిల్ సేఫ్.. ఇక ఆ ఇద్దరికి చోటు కష్టమే!!

Story first published: Wednesday, December 30, 2020, 18:16 [IST]
Other articles published on Dec 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+