
సిడ్నీ: సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 312/6 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 407 పరుగుల భారీ లక్షాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 244 పరుగులకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా.. 338 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో 94 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్ (73), స్టీవ్ స్మిత్ (81), కామెరాన్ గ్రీన్ (84) హాఫ్ సెంచరీలు బాదడంతో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని భారత్ ముందు భారీ లక్ష్యంను ఉంచింది. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్లు క్రీజులోకి వచ్చారు.
కామెరాన్ గ్రీన్ (84; 132 బంతుల్లో 8x4, 4x6) ఔటయ్యాక టీ విరామ సమయంలో ఆస్ట్రేలియా 312/6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో గ్రీన్.. కీపర్ వృద్ధిమాన్ సాహా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ 87 ఓవర్లలో 312/6 స్కోర్ సాధించింది. అంతకుముందు గ్రీన్.. టిమ్ పైన్ (38)తో కలిసి 104 పరుగుల శతక భాగస్వామ్యం నిర్మించాడు. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
ఓవర్ నైట్ స్కోర్ 103/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్ (73), మాథ్యూ వేడ్ (4) ఔటయ్యారు. ఇద్దరినీ నవదీప్ సైనీ ఔట్ చేశాడు. లబుషేన్, స్మిత్ మూడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కుదురుకున్నట్లే కనిపించినా.. సైనీ ఓ చక్కటి బంతితో లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. అతడు వేసిన 47వ ఓవర్ తొలి బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లో పడడంతో ఆసీస్ 138 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం వేడ్ (4) సైతం అచ్చం అలాగే ఔటయ్యాడు. సైనీ బౌలింగ్‌లోనే వికెట్ల వెనుక కీపర్ సాహాకు దొరికిపోయాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 148/4గా నమోదైంది.
ఈ క్రమంలోనే జోడీ కట్టిన గ్రీన్, పైన్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బుమ్రా వేసిన 83వ ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాదిన గ్రీన్.. టెస్టుల్లో తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం గ్రీన్ సిక్కులతో విరుచుకుపడ్డాడు. పైన్ కూడా ఫోర్స్, సిక్సర్లతో సిడ్నీ గ్రౌండ్‌ని హోరెత్తించారు. టీ సమయానికి గ్రీన్ ఔట్ కావడంతో 312 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు ఫైన్. దీంతో భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 407 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్స్‌లో అశ్విన్ , సైనీలు చెరో రెండు వికెట్స్ తీయగా, బుమ్రా, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.