సిడ్నీ టీ20: ఆసీస్ గడ్డపై అత్యుత్తమ రికార్డుని నెలకొల్పిన కృనాల్ పాండ్యా


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. సిడ్నీ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను సమం చేసింది. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌తో అంతర్జాతీయ టీ20ల్లో ఆరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా ఆసీస్ గడ్డపై రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.
అందులో ఒకటి అరుదైన రికార్డు కాగా, మరొకటి చెత్త రికార్డు కావడం విశేషం. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో కృనాల్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసిన కృనాల్ ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కృనాల్ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.
మూడో టీ20లో అరుదైన రికార్డు
అయితే, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కృనాల్ పాండ్యా 36 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ గడ్డపై టీ20ల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కృనాల్ పాండ్యా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు.
విమర్శలకు బంతితోనే సమాధానం
తొలి టీ20లో తనపై వచ్చిన విమర్శలకు బంతితోనే సమాధానం చెప్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. ఈ ఏడాది హోబార్ట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మాక్స్‌వెల్ మూడు వికెట్లు తీసి 10 పరుగులు ఇచ్చాడు. ఆసీస్ గడ్డపై ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా, ఇప్పుడు పాండ్యా ఆ రికార్డును అధిగమించాడు.

6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (33), ఫించ్ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్ (25 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.

డిసెంబర్ 6 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్
ఓపెనర్ శిఖర్ ధావన్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23), దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 22 నాటౌట్) రాణించారు. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఇక, భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications