For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Big Bash League: కొంప ముంచిన జిడ్డు బ్యాటింగ్.. చిత్తుగా ఓడిన సిడ్నీ సిక్సర్స్‌

Sydney Sixers fail to put up a fight against Adelaide Strikers

బిగ్ బ్యాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ చిత్తుగా ఓడింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాట్ షార్ట్ దంచికొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అడిలైడ్‌ జట్టు.. మ్యాట్ షార్ట్ (53 బంతుల్లో 84) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు క్రిస్ లిన్ (41), ఆడమ్ హోస్ (40) రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ టీం బ్యాటింగ్‌లో షార్ట్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. మైదానం నలుమూలలా షాట్లు ఆడిన అతను మొత్తం 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

భారీ లక్ష్య ఛేదనల సిడ్నీ సిక్సర్స్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. ఓపెనర్ జోష్ ఫిలిప్ (26) జిడ్డు బ్యాటింగ్ ఆడగా.. మరో ఓపెనర్ ప్యాటర్సన్ (9) కూడా రాణించలేదు. కెప్టెన్ మోజెస్ హెన్రిక్స్ (29 బంతుల్లో 24) పరమ చెత్తగా ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో ఒక కెప్టెన్ అయ్యుండి ఇంత చెత్తగా ఆడటంపై అతన్ని అభిమానులు తిట్టిపోస్తున్నారు. హెన్రిక్స్‌కు తోడు జోర్డాన్ సిల్క్ (36) కూడా నిదానంగానే ఆడాడు. వీళ్లిద్దరూ వన్డే, టెస్టు తరహా బ్యాటింగ్ చేయడంతో సిడ్నీ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు.

ఇదే క్రమంలో అడిలైడ్ బౌలర్ హెన్రీ థార్న్‌టన్ కూడా సిడ్నీని బాగా దెబ్బ తీశాడు. అతనొక్కడే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతనికి జత కలిసిన రషీద్ ఖాన్ కూడా మూడు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఆ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అడిలైడ్ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటుతో అదరగొట్టి, బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని కట్టడి చేసిన మ్యాట్ షార్ట్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, December 14, 2022, 18:21 [IST]
Other articles published on Dec 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+