సరికొత్త రికార్డుని సొంతం చేసుకున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్
సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్ 2015లో భాగంగా బుధవారం తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇచ్చింది. తొలి క్వార్టర్ ఫైనల్‌కు వేదికైన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఓ సరికొత్త రికార్డుని నమోదు చేసింది.
ఏంటీ ఆ సరికొత్త రికార్డని అనుకుంటున్నారా? ఆస్టేలియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ క్రికెట్ గ్రౌండ్‌లో ఇప్పటి వరకు 149 వన్డే మ్యాచ్‌లు ఆడగా, బుధవారం శ్రీలంక Vs దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ 150వది.
దీంతో 150 వన్డే మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సరికొత్త రికార్డుని సృష్టించింది. ప్రపంచంలో అత్యధిక వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన గ్రౌండ్‌గా షార్జా మైదానం ఉంది. ఈ గ్రౌండ్‌లో ఇప్పటి వరకు 218 వన్డేలు ఆడారు.

అత్యధిక వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన క్రికెట్ మైదానాలు:
* షార్జా క్రికెట్ స్టేడియం - 218 వన్డేలు
* సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ - 150 వన్డేలు
* మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ - 142 వన్డేలు
* ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో - 116 వన్డేలు
* హారారే స్పోర్ట్స్ క్లబ్ - 114 వన్డేలు
* షేరే బంగ్లా జాతీయ స్టేడియం, మిర్‌పుర్, ఢాకా - 82 వన్డేలు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications