Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

594 పరుగులతో రికార్డుల మోత: రంజీ మ్యాచ్‌లో ట్రిపుల్, డబుల్

ముంబై: మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు స్వప్నిల్ గుగాలే, అంకిత్ బావ్నే రికార్డులను తిరగరాశారు. ఇప్పటివరకు రంజీ క్రికెట్‌లో శ్రీలంక లెజెండ్ క్రికెటర్లు మహిళా జయవర్దనే-కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డుకు చేరువగా వచ్చారు. అంతేకాదు రంజీ క్రికెట్‌లో ఉన్న పాత రికార్డులను చెరిపివేశారు.

ముంబైలోని వాంఖడే మైదానంలో ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో కెప్టెన్ స్వప్నిల్ గుగాలేతో పాటు నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అంకిత్ ఇద్దరూ కలిసి 594 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రపంచ రంజీ క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

Swapnil Gugale-Ankit Bawne set Ranji Trophy record with 594-run partnership

కాగా ఈ రంజీ మ్యాచ్‌లో స్వప్నిల్ ట్రిపుల్ సెంచరీ (351) చేయగా, అంకిత్ బావ్నే డబుల్ సెంచరీ (258) చేశాడు. 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న మహారాష్ట్ర వీరిద్దరి భాగస్వామ్యంతో భారీ స్కోరు సాధించింది.

స్వప్నిల్ (351; 521 బంతుల్లో 37 ఫోర్లు, 5 సిక్సర్లు), అంకిత్ (258; 500 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు)తో జట్టుకు భారీ స్కోరుని అందించారు. దీంతో 635/2 స్కోరు వద్ద మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరిని ఔట్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు విఫలయత్నం చేశారు.

స్వప్నిల్ గుగాలే, అంకిత్ బావ్నే ఇద్దరూ 69ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టారు. అంతక ముందు 1947లో విజయ్ హాజారే (288), గుల్ మహ్మాద్ (319)లు 577 పరుగుల భాగస్వామ్యం అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసింది.

2006లో దక్షిణాఫ్రికాపై కొలంబోలో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్లు మహిళా జయవర్దనే-కుమార్ సంగక్కరలు 624 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. కేవలం 30 పరుగులతో ఈ రికార్డుని మిస్ అయ్యారు.

ఈ చారిత్రక టెస్టు మ్యాచ్‌లో కుమార సంగక్కర 287 పరుగులు చేయగా, కీపర్ కుమార సంగక్కర 374 పరుగులు చేశారు. ఈ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై శ్రీలంక ఇన్నింగ్స్ 153 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోరు వివరాలు:

Maharashtra 635/2 in 173 overs declared (Swapnil Gugale 351 not out, Ankit Bawne 258 not out, Navdeep Saini 2/44) Vs Delhi 21/0 in 5 overs

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+