Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోహ్లీ కాదు.. స్మిత్ వచ్చాడంటే మళ్లీ అతనే నంబర్ వన్'

Suspended Smith will return to Test best: Starc

మెల్‌బౌర్న్: స్టీవ్ స్మిత్ నిషేదం పూర్తయిన తర్వాత మైదానంలో అడుగుపెడితే మళ్లీ అతనే నంబర్ వన్ అయిపోతాడంటూ ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్ మిచెల్ స్టార్క్ అంటున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య టెస్టు సిరీస్ మొదలుకావడంతో.. విరాట్ కోహ్లీ తానొక్కడై అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై ప్రశంసల వర్షం కురియడంతో పాటు కేవలం ఒక్క టెస్టులోనే అతని స్కోరు 200పరుగులకు చేరింది. దీంతో అతను టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.

బ్యాల్ ట్యాంపరింగ్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు స్టీవ్ స్మిత్ దూరమైయ్యాడు. అయితే అతను ఆడుతున్నంత సేపు నంబర్ వన్ స్థానంలో ఉండగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కోహ్లీ టాప్ 1 స్థానానికి దక్కించుకోగా మిచెల్ స్టార్క్ తమ జట్టు నాయకుడు మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో.. మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ.. స్మిత్ నాకు కొన్ని నెలలుగా తెలుసు. అతని ఆటతీరుపై నాకు నమ్మకముంది. అనుకోని పరిస్థితుల వల్ల స్మిత్‌పై నిషేదం పడింది. అతను దక్షిణాఫ్రికా సిరీస్‌లో తానొక్కడై జట్టను నడిపించిన తీరు అద్భుతం. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నంబర్ వన్ స్థానం అనుకుంటే వెంటనే వచ్చేయదు. చాలా సమయమే పట్టొచ్చు. కానీ, స్మిత్ తప్పకుండా మళ్లీ నంబర్ వన్ అయి తీరుతాడు.' అని తెలిపాడు.

బాల్ ట్యాంపరింగ్ కారణంగా కామెరూన్ బాన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఏడాది కాలంపాటు నిషేదాజ్ఞలు జారీ చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. డేవిడ్ వార్నర్‌పై అయితే ఏకంగా వైస్ కెప్టెన్సీపై జీవిత కాల నిషేదాన్ని విధించింది. నిషేదం విధించిన తొలి నాళ్లలో పూర్తిగా క్రికెట్‌నే వదిలేస్తామని తెలిపిన వార్నర్, స్మిత్‌లు మళ్లీ పలు దేశీవాలీ క్రికెట్‌లతో మైదానంలో కనిపిస్తున్నారు.

Story first published: Monday, August 6, 2018, 17:47 [IST]
Other articles published on Aug 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+