For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరింత దృఢంగా తయారై వస్తాడు: నిషేధానికి గురైన పృథ్వీ షాపై తివారీ

Prithvi Shaw Gets Support From Manoj Tiwary || Oneindia Telugu
 Suspended for doping, Prithvi Shaw gets support from Manoj Tiwary

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా పట్ల భారత బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ సానుభూతి చూపించాడు. పృథ్వీ షా నిషేధిత ఉత్ప్రేరకం వాడటంతో అతడిపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

పృథ్వీ షా మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. ఇది సాధారణంగా దగ్గు మందుల్లో ఉంటుందని పేర్కొన్న బీసీసీఐ.. అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం మ్యాచ్‌లు ఆడేటపుడు లేదా బయట కూడా దీనిని ఉపయోగించకూడదు.

అయితే, జులై 16నే పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే బీసీసీఐ పృథ్వీ షాకి నోటీసులు జారీ చేసింది. దగ్గు మందు వినియోగం వల్లే నిషేధిత ఉత్ప్రేరకం తన ఒంట్లోకి వచ్చిందని పృథ్వీ ఇచ్చిన వివరణతో బీసీసీఐ సంతృప్తి చెందలేదు. దీంతో అతడిపై 8 నెలలు పాటు నిషేధం విధించింది.

పృథ్వీ షాకి విధించిన శిక్ష నవంబరు 15కి పూర్తి కానుంది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, ఈ ఏడాది ఆరంభంలో తాను వేసుకున్న దగ్గు మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని షా ట్విట్టర్‌లో వివరణ ఇచ్చాడు. పృథ్వీ షా వివరణపై సోషల్ మీడియాలో పలువురు అతడికి మద్దతుగా తెలుపుతున్నారు.

ఈ నిషేధం నుంచి పృథ్వీ షా త్వరగా కోలుకుని, మరింత దృఢంగా తయారై వస్తాడని మనోజ్ తివారీ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో "ఈ విధంగా వివరణ ఇచ్చావు. చాలా మంచిది. పొరపాట్లు జరుగుతాయి. ప్రత్యేకంగా క్రీడలకు సంబంధించిన పదార్థాల్లో. మీరు మరింత బలంగా తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు.

గతేడాది వెస్టిండిస్ పర్యటనలో భాగంగా తన అరంగేట్ర టెస్టులోనే అద్భుత సెంచరీతో పృథ్వీ షా అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడటంతో ఆ సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు.

అయితే, గాయ నుంచి కోలుకుని ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన షా... ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుఫున ఐపీఎల్‌ ఆడాడు. కాగా, ఇటీవలే తుంటి గాయానికి గురైన పృథ్వీ షా వెస్టిండీస్‌-ఎతో భారత్‌-ఎ వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Wednesday, July 31, 2019, 12:46 [IST]
Other articles published on Jul 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+