Lalit Modi Dating With Sushmita Sen: ఇక ఆపండి చాలు.. నా పని నేను చూసుకుంటా సుస్మితా సేన్ క్లారిటీ.. !

మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్‌తో తాను డేటింగ్లో ఉన్నానంటూ ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. లలిత్ మోడీ ఇరువురు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చరంబోలా చేశాడు. 56ఏళ్ల లలిత్ మోడీ, 46ఏళ్ల సుస్మితాసేన్ మధ్య 15ఏళ్ల క్రితం నుంచే స్నేహం ఉంది. అయితే లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి లండన్ పారిపోవడం.. ఆ తర్వాత అతని మీద కేసులు కొనసాగుతుండడంతో వీరిద్దరు దూరమయ్యారు. ఇక సుస్మితా సేన్ చాలా మందితో రిలేషన్ షిప్ మెయింటెన్ చేసింది. విక్రమ్ భట్, రోమన్ షాల్, వసీం అక్రమ్, బంటీ సచ్ దేవ్, ఇంతియాజ్ ఖత్రీ, ముదాస్సర్ అజీజ్, రణదీప్ హుడా తదితరులతో ఆమె రిలేషిన్ షిప్ మెయింటెన్ చేసినట్లు రూమర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని బయటపడ్డాయి. కొన్ని బయటపడలేదు.

త్వరలోనే పెళ్లి ముచ్చట తీరుతుంది
ప్రస్తుతం లలిత్ మోడీతో డేటింగ్‌లో ఉన్న సుస్మితా సేన్ త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లలిత్ మోడీ కూడా పేర్కొనడం గమనార్హం. సుస్మితా సేన్ తన బెటర్ హాఫ్ అని, సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ప్రస్తుతం డేటింగ్లో ఉన్నామని, త్వరలోనే పెళ్లి ముచ్చట కూడా తీరుతుందని లలిత్ మోడీ వెల్లడించడం గమనార్హం.

జస్ట్ లవ్‌లో ఉన్నా
ఇకపోతే లలిత్ మోడీ, సుస్మితా సేన్ దంపతులు అయ్యారంటూ చాలా మంది నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లలిత్ మోడీ క్లారిటీ ఇచ్చినా శుభాకాంక్షల పర్వం మాత్రం ఆగట్లేదు. తాజాగా సుష్మితా సేన్ సైతం ఈ విషయంపై స్పందించింది. 'ప్రస్తుతం నేను నాకు ఇష్టమైన ప్లేసులో ఆనందంగా ఉన్నాను. ఇంకా రింగ్స్ మార్చుకోలేదు, పెళ్లి కూడా కాలేదు. జస్ట్ లవ్‌లో ఉన్నా. బహుశా ఈ క్లారిటీ మీకు సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. మీరు కూడా మీ విషయాలపై ఫోకస్ పెట్టండి. నా సంతోషాన్ని పంచుకునేవారికి ధన్యవాదాలు. పంచుకోని వారికి నా గురించి ఏం అవసరం. ఎనీ వే లవ్ యూ గయ్స్' అంటూ తన ఇన్ స్టాలో పేర్కొంది. ఈ మేరకు ఓ ఫోటో కూడా పోస్టు చేసింది. అందులో తన ఇద్దరు కూతుళ్లతో సుస్మితా కన్పించింది.

2010లో లండన్ పారిపోయిన లలిత్ మోడీ
ఐపీఎల్ రూపకర్తగా లలిత్ మోడీకి ఒకప్పుడు యమ క్రేజు ఉండేది. లలిత్ మోడీ సీజన్‌కు మొట్టమొదటి ఛైర్మన్, కమిషనర్‌గా వ్యవహరించారు. రెండు సంవత్సరాల పాటు లలిత్ మోడీ తన హవా ఏంటో చూపించాడు. ఇక ఐపీఎల్ చీఫ్‌గా ఉన్న సమయంలో లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ కేసులు బనాయించింది. దీంతో ఐపీఎల్ చీఫ్ పదవి నుండి ఉద్వాసనకు గురి అయ్యాడు. అదే సమయంలో కేసులు నమోదు కావడంతో లలిత్ మోడీ 2010లో లండన్ పారిపోయాడు. అక్కడ జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అతనికి పొలిటికల్ సపోర్ట్ ఉంటుందనేది బహిరంగ రహస్యమే. ఇకపోతే లలిత్ మోడీపై ఉన్న కేసులు దాదాపు క్లియర్ అవ్వడం గమనార్హం.
అతనితో విడిపడి.. ఇప్పుడు మోడీతో జత కూడి
ఇకపోతే సుస్మితా సేన్‌తో కలిసి ఇటీవల లలిత్ మోడీ మాల్దీవుల టూర్‌కు వెళ్లాడు. టూర్లో భాగంగా వారు దిగిన కొన్ని స్టిల్స్ అతను నెట్టింట పోస్ట్ చేశాడు. వీరిద్దరూ ఫోటోల్లో యమ ఆనందంగా ఉన్నట్లు కన్పించారు. ఇక సుస్మితా సేన్ గురించి చెప్పనవసరం లేదు. 1994లో మిస్ యూనివర్స్‌గా నిలిచింది. ఆమె ఇండియా నుంచి విశ్వ సుందరిగా ఎంపికైన తొలి మహిళగా పేరొందింది. అలాగే ఫెమినా మిస్ ఇండియా తదితర అవార్డులను కూడా ఆమె పొందింది. రోమాన్ షాల్‌తో 2021డిసెంబర్‌లో విడిపోయాక.. ఆమె ఇప్పుడు లలిత్ మోడీతో లవ్ పట్టాలెక్కింది. ఆమె పెళ్లి చేసుకోలేదు కానీ ఆమెకు రీని సేన్, అలీసా సేన్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications