Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ఎంఎస్ ధోనీ’: క్రికెటర్ కంటే ముందు ధోనీ ఏంటీ?

ముంబై: టీమిండియా కెప్టెస్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 'ఎంఎస్ ధోనీ-ద అన్‌టోల్డ్‌ స్టోరీ' పేరుతో వస్తున్న ఈ సినిమాలో ధోనీకి సంబంధించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నట్లు సమాచారం.

కాగా, ఈ సినిమాలో ధోని క్రికెటర్‌గా మారే ప్రయాణం గురించి చూపించనున్నారు. ధోని పాత్రలో నటిస్తున్న సుషాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చాలానే కష్టపడ్డాడు. సినిమా కోసం క్రికెట్‌ బాగా నేర్చుకోవడంతో పాటు ధోనీ పని చేసిన ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో కొన్ని రోజులు గడిపాడు.

ధోనీ క్రికెటర్‌గా మారకముందు రైల్వే టికెట్‌ కలెక్టర్‌గా ఉద్యోగం చేశారు. ఆయన పోస్టింగ్‌ పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్లోనే. దీంతో సుషాంత్‌ సింగ్‌ కూడా ఖరగ్‌పూర్‌ వెళ్లి.. అక్కడి టికెట్‌ కలెక్టర్లతో మాట్లాడాడు. వారితో కలిసి ప్రయాణం చేశాడు. వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ ఏ విధంగా ఉంటుందో.. ఎలా మాట్లాడుతారో బాగా గమనించాడట.

Sushant Singh Rajput lived in railway quarters to prep up for the role of ticket collector in 'MS Dhoni'

అంతేగాక, సుషాంత్‌ ఆ సమయంలో ఏ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోనో బస చేయకుండా.. టికెట్‌ కలెక్టర్లు ఉండే రైల్వే క్వాటర్స్‌లోనే ఉన్నాడట. సినిమాలో తన పాత్ర బాగా వచ్చేందు కోసం ధోనీ టికెట్‌ కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఆయనతో కలిసి పని చేసిన సహోద్యోగులను కూడా కలిశాడట.

వారు ధోని గురించి ఎవరికీ తెలియని కొన్ని విశేషాలు చెప్పారట. అవన్నీ తనకు సినిమాలో నటించేందుకు చాలా ఉపయోగపడ్డాయని సుశాంత్ వివరించారు. కాగా, ధోనీ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+