Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది అన్యాయం సూరీడు.. బయటపడిన ఇషాన్‌-సూర్య గొడవ!

దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్‌ ట్రోఫీలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ శతకంతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అనంతపురం వేదికగా ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో అతను ఆకట్టుకుంటున్నాడు. 126 బంతుల్లో 111 పరుగులు చేశాడు. 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగాడు.

టీమిండియాలో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఇషాన్ కిషన్‌కు ఈ సెంచరీ ఎంతో అవసరం. రంజీ ట్రోఫీ ఆడటానికి ఆసక్తి చూపట్లేదనే కారణంతో ఇషాన్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన కిషాన్ ఆకట్టుకోలేకపోయాడు. కానీ రెడ్ బాల్ క్రికెట్‌లో ఇటీవల పునరాగమనం చేసిన ఇషాన్ సత్తాచాటుతున్నాడు.

Suryakumar Yadav Sparks Rift Speculation with Ishan Kishan Through Social Media Activity

బుచ్చిబాబు టోర్నమెంట్‌లో శతకంతో అలరించాడు. అయితే గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌కు దూరమయ్యాడు. కానీ రెండో రౌండ్‌లో ఇండియా-సీ తరఫున రాణిస్తున్నాడు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో సత్తాచాటిన ఇషాన్ కిషన్‌ గురించి ఒక్క పోస్ట్ చేయని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.... ఇండియా-ఏ తరఫున ఆడుతున్న షామ్స్ ములాని, తనుష్ కొటియన్‌లపై ప్రశంసల జల్లు కురిపించం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఇండియా-డీతో జరుగుతున్న మ్యాచ్‌లో 93/5 స్కోరుతో ఉన్న ఇండియా-ఏ 290 పరుగులు చేసిందంటే.. షామ్స్ (89), తనుష్ కొటియన్ (53) అర్ధశతకాలే కారణం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని కొనియాడుతూ సూర్య ట్వీట్ చేశాడు. కానీ ఐపీఎల్‌, టీమిండియాలో తన సహచరుడు అయిన ఇషాన్‌ గురించి సూర్య ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో నెట్టింట్లో పెద్దఎత్తున చర్చ సాగుతోంది.

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పు విషయంలో హార్దిక్‌ పాండ్యకు ఇషాన్ మద్దతు ఇవ్వడంతోనే.. రోహిత్ మద్దతుదారుడు అయిన సూర్య కక్ష పెంచుకున్నాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇషాన్‌ గురించి పోస్ట్ చేయకపోవడానికి మరో కారణం.. ఇషాన్ ముంబైకు చెందిన వ్యక్తి కాకపోవడమేనని పోస్టులు పెడుతున్నారు. సూర్య ప్రాంతీయ అభిమాని అని, అందుకే షామ్స్, తనుష్‌ను మాత్రమే ప్రశంసిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. ఇషాన్‌కు మద్దతు ఇవ్వకపోవడం అన్యాయమంటూ పోస్టులు పెడుతున్నారు. రోహిత్‌ స్థానంలో హార్దిక్ ముంబై ఇండియ్స్ సారథిగా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే.

Story first published: Friday, September 13, 2024, 12:19 [IST]
Other articles published on Sep 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+