నిరాశ పరిచిన పంత్, శ్రేయాస్
డాట్ బాల్స్ ఎక్కువగా ఆడేయడంతో ఒత్తిడికి గురైన పంత్.. పవర్ ప్లే చివరి ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఆగి ఆట మొదలైన కాసేపటికే ఇషాన్ కిషన్ కూడా పెవిలియన్ చేరాడు. కిషన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చే శ్రేయాస్ అయ్యర్ (13) కూడా ధాటిగా ఆడాడు. ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు. అయితే లోకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో మరో షాట్ ఆడే ప్రయత్నంలో హిట్ వికెట్‌గా వెనుతిరిగాడు.
సౌథీ హ్యాట్రిక్..
సౌథీ వేసిన చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండేసి పరుగులు తీసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13) తర్వాతి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే దీపక్ హుడా (0) గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు. సౌథీ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి బంతికే వాషింగ్టన్ సుందర్ (0)ను కూడా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. భారీ షాట్‌కు యత్నించిన వాషింగ్టన్ సుందర్.. టైమింగ్ మిస్సయ్యాడు. లాంగాన్‌లో ఉన్న నీషమ్ వేగంగా ముందుకొచ్చి అందుకున్న క్యాచ్‌తో సుందర్ నిరాశగా వెనుతిరిగాడు. సౌథీ తన టీ20 కెరీర్‌లో రెండో సారి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
కివీస్ టార్గెట్
శ్రేయాస్ అవుటైన తర్వాత అతనికి జత కలిసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13)కు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. శ్రేయాస్ క్రీజులో ఉన్నప్పుడే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ అతనికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడుతూ కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే 20వ ఓవర్లో ఒక్క బంతి కూడా ఎదుర్కొనే అవకాశం సూర్యకు రాలేదు. ఆ ఓవర్లో తొలి రెండు బంతులకు హార్దిక్ పాండ్యా రెండేసి పరుగులు చేశాడు. ఆ తర్వాత సౌథీ హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు. చివరి బంతికి భువనేశ్వర్ సింగిల్ మాత్రమే తీయగలిగాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులతో నిలిచింది.
సూర్య ప్రతాపం
పంత్ అవుటైన తర్వాత మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. తనదైన స్టైల్‌లో ఎవరూ ఊహించని షాట్లు ఆడుతూ అదరగొట్టాడు. ముఖ్యంగా లోకీ ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో షార్ట్ బాల్‌ను అతను కీపర్ తల మీదుగా బౌండరీకి తరలించిన షాట్ హైలైట్‌గా నిలిచింది. ఆ ఓవర్లో సూర్యకుమార్ ఏకంగా 22 పరుగుల పిండుకున్నాడు. ధనా ధన్ ఆటతో 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు సూర్య. ఆ తర్వాత కూడా బౌండరీల వర్షం కురిపించాడు. ఇది సూర్య టీ20 కెరీర్‌లో రెండో సెంచరీ కావడం గమనార్హం. అంతకుముందు ఇంగ్లండ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా సెంచరీతో చెలరేగాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది.


Click it and Unblock the Notifications
