Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: ఆ ఆట వెనుక చాలా కష్టం దాగుంది: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav says there is hard work behind his knock

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. రాహుల్ త్రిపాఠీ (35), సూర్యకుమార్ యాదవ్ (112 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

సూపర్ ఇన్నింగ్స్ వెనుక కష్టం

సూపర్ ఇన్నింగ్స్ వెనుక కష్టం

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. 200పైగా స్ట్రైక్ రేటుతో లంక బౌలర్లపై విరుచుకుపడిన అతను ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. కేవలం 51 బంతుల్లనే 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ క్రమంలో తన ఆట గురించి సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఆట వెనుక చాలా కష్టం దాగుందని వెల్లడించాడు.

ప్రాక్టీస్‌లో ఒత్తిడి అవసరం..

ప్రాక్టీస్‌లో ఒత్తిడి అవసరం..

'మ్యాచ్ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో మనపై ఒత్తిడి తెచ్చుకోవడం చాలా ముఖ్యం. ప్రాక్టీస్‌లో ఆ పని చేస్తే.. మ్యాచ్ ఆడటం కొంచెం సులభం అవుతుంది. ఈ ఆటలో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అదే సమయంలో క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్స్ కూడా చాలా ముఖ్యం. నీ ఆట ఏంటో అర్థం చేసుకొని, దానికి తగ్గట్లే ప్రిపేర్ అవ్వాలి' అని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. బ్యాటర్‌కు వెనుక వైపు ఉండే బౌండరీలు 50-60 మీటర్లు మాత్రమే ఉంటాయని, అందుకే వాటిని తను టార్గెట్ చేశానని చెప్పాడు.

ద్రావిడ్ ఇచ్చిన సలహా..

కొన్ని షాట్లు ముందు నుంచే ఆడాలని అనుకుంటానని, అదే సమయంలో బౌలర్లు ప్లాన్ ఛేంజ్ చేస్తే దానికి తగ్గట్లు ఆడేందుకు మరికొన్ని షాట్లను కూడా ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. తన ఆట విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పెద్దగా జోక్యం చేసుకోడని చెప్పిన సూర్యకుమార్.. 'రాహుల్ భాయ్.. నా ఆటను నన్ను ఎంజాయ్ చేయడానికి వదిలేస్తాడు. నీ ఆటతీరును నువ్వు బాగా ఎంజాయ్ చెయ్. నువ్వు ఎలా ఫీలవుతున్నావో దాన్ని ఎక్స్‌ప్రెస్ చెయ్యి అంతే ఇంకేం ఆలోచించకు అని రాహుల్ చెప్పాడు' అని పేర్కొన్నాడు.

Story first published: Sunday, January 8, 2023, 12:29 [IST]
Other articles published on Jan 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+