ICC T20I Rankings: బాబర్‌ను మళ్లీ వెనక్కి నెట్టిన సూర్యకుమార్.. అక్షర్, హార్దిక్ మరింత ముందుకు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను అధిగమించి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో కేవలం 36బంతుల్లో 69పరుగులతో రాణించిన సూర్య.. తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఈ సిరీస్‌లో భారత్ 2-1తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో బాబర్ ఆజామ్ టీ20ల్లో రెండో సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే సెంచరీ చేసినప్పటికీ అతను తన రెండో స్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో బాబర్ సహచర ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మంచి ఫామ్ కనబర్చుతూ తిరిగి తన అగ్రస్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమం అయింది.

టాప్ 20లోకి దూసుకొచ్చిన అక్షర్ పటేల్
ఇకపోతే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ భారత్‌తో జరిగిన రెండో టీ20లో 31పరుగులతో రాణించడంతో అతను నెం.5స్థానానికి ఎగబాకాడు. అదే సమయంలో బౌలింగ్ జాబితాలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇప్పుడు నం.18 స్థానానికి చేరుకున్నాడు. ఆడమ్ జంపా నెం.6స్థానానికి చేరుకోగా.. భువనేశ్వర్ కుమార్ నెం.10వ స్థానానికి పడిపోయాడు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భువీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయిన సంగతి తెలిసిందే.

ఆల్రౌండర్ల లిస్టులో హార్దిక్ పాండ్యా
ఇకపోతే ఆల్‌రౌండర్ల చార్ట్‌లలో.. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ.. షకీబ్ అల్ హసన్‌ను దాటి నంబర్ 1 పొజిషన్‌కు చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ల లిస్టులో టాప్ ఫోర్‌లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20లలో పాండ్యా 9, 25 నాటౌట్ ప్రదర్శనలు కనబరిచాడు. ప్రస్తుతం శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కూడా నాలుగో స్థానంలోనే ఉన్నాడు. అయితే ముందుగా వనిందు హసరంగా 184పాయింట్లు కలిగి ఉండడంతో అతన్ని 4వ ర్యాంకుగా, హార్దిక్‌ను 5వ ర్యాంకుగా టేబుల్లో పేర్కొన్నారు.

సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర
నంబర్ 4లో భారత్‌కు ఎలాంటి ప్లేయర్ కావాలో అలాంటి ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. నయా మిస్టర్ 360.. కుదురుకుంటే ఎంతటి మ్యాచ్ అయినా వన్ సైడ్ కావాల్సిందే. ఇక సిరీస్ డిసైడర్ అయిన ఆసీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్ దిగిన సూర్య.. వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలెట్టకుండా కాసేపు జాగ్రత్తగానే ఆడాడు. కాస్త కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లకు తన మాస్టర్ క్లాస్ షాట్ల రుచి చూపించాడు.
సూర్య ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్లు లయ తప్పినట్లే కన్పించింది. ఫలితంగా స్కోరు బోర్డు ఎక్కడా ఆగకుండా అమాంతం దూసుకెళ్లింది. సూర్య (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) విధ్వంసం.. కోహ్లీ అండగా సాగింది. ఇక అతను ఔటయినప్పటికీ.. అప్పటికీ భారత్ ఛేజింగ్‌కు అనువైన స్కోరును కలిగి ఉండేలా చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications