Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: ప్రాక్టీస్‌లో అదరగొట్టిన సూర్యకుమార్.. ఏం షాట్లురా అవి?

Suryakumar Yadav practices before INDvsSL T20I series

టీమిండియా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. నెట్ ప్రాక్టీస్‌లో చెమటలు చిందించాడు. శ్రీలంకతో తొలి టీ20కి ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతను సూపర్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో డిఫెన్స్ ఆడినా కూడా బంతి బౌండరీకి పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రాక్టీస్ ప్రారంభంలో అన్నీ సంప్రదాయబద్ధమైన షాట్లు ఆడిన సూర్య.. ఆ తర్వాత నెమ్మదిగా తన ట్రేడ్‌మార్క్ షాట్లలోకి దిగాడు. మిస్టర్ 360 పేరు సార్థకం చేసుకుంటూ అన్ని వైపులా షాట్లు ఆడుతూ నెట్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో జరిగే తొలి టీ20లో సూర్య చెలరేగుతాడని జోస్యం చెప్తున్నారు.

శ్రీలంకతో మూడు టీ20ల కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లను ఈ సిరీస్ కోసం సెలెక్ట్ చేయలేదు. అయితే టీ20 సిరీస్‌ తర్వాత మొదలయ్యే వన్డే సిరీస్‌లో మాత్రం వీళ్లంతా ఆడనున్నారు. ఈ నేపథ్యంలోనే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. అతని డిప్యూటీగా ఎవరూ ఊహించని విధంగా సూర్యకుమార్‌ను ఎంపిక చేశారు.

అయితే సీనియారిటీ ప్రకారం చూసుకుంటే వైస్ కెప్టెన్ పదవి సూర్యకుమార్‌కు తప్ప ఇంకెవరికీ ఇచ్చే ఛాన్స్ లేదని నిపుణులు అంటున్నారు. అలాగే టీ20 ఫార్మాట్‌లో టీమిండియా భవిష్యత్తు అతనే అంటూ కొనియాడారు. శ్రీలంకతో జరిగే తొలి టీ20లో సూర్య రెచ్చిపోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అతను తనదైన స్టైల్‌లో మైదానం నలువైపులా షాట్లు ఆడితే చూడాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి సూర్య ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.

Story first published: Tuesday, January 3, 2023, 8:02 [IST]
Other articles published on Jan 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+