టీమిండియా నుంచి ఔట్.. సంచలన నిజం బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తన వన్డే కెరీర్‌లోని వైఫల్యాలపై సంచలన విషయాలను వెల్లడించారు. ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. తన సొంత తప్పిదాల వల్లే తన వన్డే కెరీర్ ఎక్కువ కాలం సాగలేదని అంగీకరించారు. టీ20 క్రికెట్‌లో రాణించడానికి పడినంత శ్రమను వన్డే ఫార్మాట్‌ను అర్థం చేసుకోవడంపై పెట్టలేదని స్పష్టం చేశారు. భారత్ తరఫున 37 వన్డేలు ఆడిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 సగటుతో 773 పరుగులు మాత్రమే చేయగలిగారు. 2023 వన్డే ప్రపంచ కప్‌లోనూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను వన్డే జట్టు నుంచి పక్కన పెట్టారు.
బ్యాటర్లకు ముఖ్యంగా మిడిలార్డర్ ప్లేయర్లకు వన్డే ఫార్మాట్ ఎందుకు అత్యంత సవాలుతో కూడుకున్నదో సూర్యకుమార్ యాదవ్ విశ్లేషించారు. 4,5, లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు మ్యాచ్ పరిస్థితులు వేగంగా మారుతుంటాయని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. కొన్నిసార్లు సున్నా పరుగులకే రెండు వికెట్లు లేదా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన క్లిష్ట సమయాల్లో క్రీజులోకి రావాల్సి వస్తుందని వివరించారు. అలాంటి సమయాల్్లో ఆరంభంలో టెస్ట్ మ్యాచ్ లాగా నిలకడగా ఆడుతూ.. ఆ తర్వాత టీ20 తరహాలో గేర్ మార్చి వేగంగా పరుగులు సాధించాల్సి ఉంటుందని.. బౌలర్లకు తగిన గౌరవ ఇవ్వడం అత్యవసరమని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

లోపాన్ని అంగీకరించిన సూర్యకుమార్ యాదవ్
మిడిలార్డర్‌లో తాను ఎదుర్కొన్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయామని సూర్యకుమార్ యాదవ్ స్వయంగా అంగీకరించారు. "నేను ఐదో లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని తెలుసు.. కానీ ఆ ఫార్మాట్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కనురెప్పపాటులో 20-25 మ్యాచ్‌లు గడిచిపోయాయి" అని సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వన్డేల్లో తాను ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి ఎవరినో కాకుండా తన స్వయంకృత అపరాధాన్నే నిందించుకుంటానని ఆయన తెలిపారు.
వన్డేల్లో కొరవడిన టీ20 శ్రమ
టీ20 క్రికెట్లో సక్సెస్ సాధించేందుకు పడిన తీవ్ర కృషి, ప్రాక్టీస్ వన్డే ఫార్మాట్ కోసం చేయలేకపోవడం వల్లే తాను ఈ ఫార్మాట్లో వెనుకబడిపోయానని సూర్యకుమార్ యాదవ్ అంగీకరించారు. వన్డే క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాననే బాధ తనలో ఇప్పటికీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఇప్పటికీ తగినంత సమయం ఈ ఫార్మాట్‌పై కేటాయించలేకపోయానని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

