Suryakumar Yadav: టెస్టుల్లో అరంగేట్రంపై పెదవి విప్పిన సూర్య.. త్వరలోనే అంటూ హింట్

టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అయితే ప్రతి క్రికెటర్ కూడా టెస్టుల్లో మెరవాలని ఆశ పడతాడు. అదే ఆశ సూర్యకుమారుడికీ ఉంది. దీనిపై మీడియా సమావేశంలో పెదవి విప్పిన సూర్యకుమార్.. 'ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది' అని చెప్పాడు. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. అన్నీ అనుకున్నట్లే జరిగితే వచ్చే బంగ్లాదేశ్ పర్యటనలోనే సూర్యకు టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కొచ్చు.
'క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ముందుగా రెడ్ బాల్ క్రికెట్ ఆడతాం. నేను కూడా మా ముంబై జట్టు తరఫున చాలా కాలం ఆడాను. కాబట్టి నాకు టెస్టు ఫార్మాట్‌పై ఒక అవగాహన ఉంది. నాకు ఆ ఫార్మాట్ ఆడటం ఇష్టం కూడా. త్వరలోనే టెస్టుల్లో కూడా ఆడతానని అనుకుంటున్నా' అని సూర్యకుమార్ అన్నాడు. ఇంతకుముందు రెండు, మూడుసార్లు అతన్ని టెస్టు జట్టులోకి తీసుకున్నప్పటికీ.. మ్యాచ్‌లో ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్నా, దేశవాళీల్లో సత్తా చాటినా సరే కొన్నేళ్ల క్రితం వరకూ సూర్యకుమార్‌ను సెలెక్టర్లు నిర్లక్ష్యం చేశారు. అతనికి భారత జట్టులో చోటు లభించలేదు.
ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ ఆలోచనలు వచ్చి చాలా ఫ్ట్రస్ట్రేట్ అవుతానని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. 'నాకు గతం ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. ఒంటరిగా ఉన్నా, నా భార్యతో ట్రావెల్ చేస్తున్నా దాని గురించే మాట్లాడుకుంటాం. రెండు, మూడేళ్ల క్రితం పరిస్థితి గురించే చర్చించుకుంటాం. అలాగే అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందా? అని ఆశ్చర్యపోతాం. అప్పుడు ఫ్రస్ట్రేషణ్ ఉండటం నిజమే. అయితే ఆ పరిస్థితిలో కూడా ఏదైనా పాజిటివ్ ఉందా? దాన్నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా? అనే ఆలోచించేవాడిని. ఒక్కో అడుగు ముందుకు ఎలా వెయ్యాలి? ఇంత కంటే మంచి క్రికెటర్ ఎలా అవ్వాలి? అని శోధించేవాడిని' అని చెప్పుకొచ్చాడీ స్టార్ బ్యాటర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications