టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికైన తర్వాత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్య టీ20 జట్టు బాధ్యతలు అందుకుంటాడనుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. ఈ సంచలన నిర్ణయానికి హార్దిక్ ఫిట్‌నెస్ కారణాలు అంటూ సెలక్టర్లు, నయా కోచ్ వివరించారు.
అయితే ఈ వివరణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ ఎప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించడా? సూర్యకుమార్ యాదవ్‌కు ఎప్పటికీ గాయమవ్వదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. గతేడాది ఆఖర్లో దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం సూర్యకు శస్త్రచికిత్స జరిగిందని, ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆటకు దూరమయ్యాడని గుర్తు చేస్తూ క్రికెట్ క్రిటిక్స్ తమ వాదనలు వినిపిస్తున్నారు. కెప్టెన్ విషయంలోనూ గంభీర్ కేకేఆఆర్ ఫేవరేటిజం చూపించాడని ఆరోపణలు చేశారు. కేకేఆర్ యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.

కాగా, కోచ్ గంభీర్ తనపై విశ్వాసం ఉంచడానికి గల కారణాలను సూర్యకుమార్ వివరించాడు. గంభీర్ సారథ్యంలోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశానని, తన మనస్తత్వం నయా కోచ్‌కు బాగా తెలుసని చెప్పాడు. ఆ నమ్మకంతోనే తనకి కీలక బాధ్యతలు అందించాడని పరోక్షంగా వెల్లడించాడు. ''గౌతమ్ గంభీర్‌తో నా బంధం ఎంతో ప్రత్యేకమైనది. కేకేఆర్‌లో అతని కెప్టెన్సీలోనే నేను అరంగేట్రం చేశాను. అతనితో నా బంధం విలువైనది. నేను ఎంతగా శ్రమిస్తానో, ఆటపై నా మైండ్‌సెట్ అతనికి తెలుసు''
''కెప్టెన్‌గా కానీ సమయంలోనూ మైదానంలో నాయకుడిగా ఉండటాన్ని నేనెప్పుడూ ఆస్వాదిస్తాను. ఎంతో మంది కెప్టెన్ల నుంచి ఎంతో నేర్చుకున్నాను. కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అందుకోవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది.కేకేఆర్ తరఫున గంభీర్, సూర్య కలిసి ఆడారు. 2014 టైటిల్ విజయం సాధించిన కోల్‌కతా జట్టుకు గంభీర్ కెప్టెన్‌గా, సూర్య వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక టీ20 సిరీస్‌తో సూర్య-గంభీర్ కాంబినేషన్ మొదలుకానుంది.