Suryakumar Yadav: సూర్య అంటే పేరు కాదు ముంబై కా బ్రాండ్.. అత్యధిక హాఫ్ సెంచరీలతో హవా..!

ఐపీఎల్-2022 సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా 8పరాజయాల తర్వాత తన తొలి విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో గెలుపొంది కెప్టెన్ రోహిత్ శర్మకు సూపర్ డూపర్ బర్త్ డే గిఫ్ట్ అందజేసింది. కానీ ఈ విజయం అంతా ఈజీగా రాలేదు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158పరుగులు చేయగా.. ఛేదనకు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తాకింది. రోహిత్ శర్మ 2పరుగులకే ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ 26పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
46పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టు విజయతీరాలకు చేరడానికి మెయిన్ రీజన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఎంత ఓపికగా ఆడాదో.. ఎంత సొగసుగా బ్యాటింగ్ చేశాడో.. ఎంత సమన్వయంతో ముంబై అభిమానుల మనసు గెలిచాడో.. ఎంత చక్కగా తిలక్ వర్మతో కలిసి భాగస్వామ్యం నమోదు చేశాడో..! ఒక్క విజయం కోసం తహతహలాడుతున్న ముంబై జట్టుని, ముంబై అభిమానులకు తన హాఫ్ సెంచరీతో గెలుపురుచి చూపించాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. తిలక్ వర్మ(35పరుగులు)తో కలిసి 81పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ముంబై గెలుపునకు గట్టి పునాది వేశాడు. తన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడమే నా పని
సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. 'నేను చివరి వరకు ఆడాలనుకున్నా. రోహిత్ ఔటయ్యాక.. ఎలాగైనా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడమే నంబర్ 3లో దిగిన నా పని. నేను ఔటయిన తర్వాత మా ప్లేయర్లు గెలుపు వరకు తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. రాబోయే మరికొన్ని మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను. నేను అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌ను ఆస్వాదించాను.. కానీ నేను నంబర్ 3లో బ్యాటింగ్ చేయడాన్ని మరింత ఇష్టపడతాను. ఎందుకంటే ఆ స్థానంలో వచ్చిన వారికి గేమ్‌ను ఎలా నడిపించాలో ఓ క్లారిటీ ఉంటుంది.' అన్నాడు.

15హాఫ్ సెంచరీలతో రికార్డ్
ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ ఓ ఘనత అందుకున్నాడు. 2018 నుంచి ఇప్పటివరకు ముంబై తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్య కొనసాగుతున్నాడు. 2018 సీజన్ నుంచి ముంబై తరఫున ఆడుతున్న ఈ ప్లేయర్ ఇప్పటివరకు 15 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్ కెరీర్లో మొత్తం 16హాఫ్ సెంచరీలు చేసిన సూర్య.. అందులో 15ముంబై తరఫునే చేయడం గమనార్హం. మిగతా ఒకటి కోల్ కతా తరఫున చేశాడు. కోల్ కతా తరఫున లోయర్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై యాజమాన్యం గుర్తించి 2018లో కొనుగోలు చేసింది. పైగా అతని ఓపెనర్‌గా, మిడిలార్డర్లో బరిలో దించి అతని సత్తాను వినియోగించుకుంది.

ముంబైకి వెన్నుదన్నుగా సూర్య
2018 సీజన్లో ముంబై తరఫున అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆ సీజన్లో 512పరుగులు చేసిన సూర్య 4హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక 2019లోనూ పర్వాలేదనిపించిన సూర్య 2హాఫ్ సెంచరీలతో పాటు 424పరుగులు చేశాడు. 2020సీజన్లో 4హాఫ్ సెంచరీలతో 480పరుగులతో రాణించాడు. 2021సీజన్లో కాస్త తడబడ్డ సూర్య 2హాఫ్ సెంచరీలతో 317పరుగులు మాత్రమే చేశాడు. ఇక ప్రస్తుత సీజన్లో 7మ్యాచ్‌లు ఆడిన సూర్య 3హాఫ్ సెంచరీలతో 290పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ప్రతి సీజన్లో బ్యాటింగ్లో ముంబై జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications