Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Suryakumar Yadav: దేవీషా శెట్టితో సూర్యకుమార్ యాదవ్ లవ్‌స్టోరీ.. ప్రేమ ఎలా వికసించిందో తెలుసా?

Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చాలా మంది యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వృత్తిపరమైన జీవితం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు కానీ అతని వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. సూర్యకుమార్ యాదవ్ దేవీషా శెట్టిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. వారిద్దరూ తరచుగా తమ ఫోటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో పంచుకుంటారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసుకుందాం. వారు ఎప్పుడు, ఎలా కలుసుకున్నారు, వివాహం చేసుకున్నారో తెలుసుకోండి.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ 1990 సెప్టెంబర్ 14న ముంబైలో అశోక్ కుమార్ యాదవ్, స్వప్న యాదవ్ దంపతులకు జన్మించారు. సూర్య కుమార్ యాదవ్ 2010-11 రంజీ సీజన్‌లో ఢిల్లీపై ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఆడే అవకాశం సూర్య కుమార్ యాదవ్‌కు లభించింది. క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కొన్ని రోజు ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ సూర్య కుమార్ యాదవ్ 2014లో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టుతో అనుబంధం కలిగి ఉన్నాడు.

Suryakumar Yadav Love Story with Devisha Shetty How Their Relationship Blossomed

దేవీషా శెట్టి
దేవీషా శెట్టి 1993 నవంబర్ 7న ముంబైలో ఒక దక్షిణ భారత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దేవదాస్ శెట్టి ఒక హోటల్ వ్యాపారవేత్త. ఆమె తల్లి లతా శెట్టి గృహిణి. దేవీషా ఆమె కుటుంబంలో చిన్నది. ఆమెకు దీక్షా శెట్టి అనే అక్క కూడా ఉంది.దేవీషా శెట్టి ముంబైలోని ఒక సంపన్న కుటుంబంలో పెరిగారు. దేవీషా శెట్టి ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్ నుంచి తన చదువును పూర్తి చేసింది. దీని తర్వాత ఆమె ముంబైలోని ఆర్.ఏ పొద్దార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి పట్టభద్రురాలైంది. దేవీషా శెట్టికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె చిన్నప్పటి నుంచి నాట్యం చేస్తోంది. ఇది మాత్రమే కాదు.. ఆమె నృత్యాన్ని తన వృత్తిగా చేసుకుంది. ముంబైలో నృత్య శిక్షకురాలిగా కూడా మారింది.

కాలేజీలోనే దేవీషాను కలిసిన సూర్యకుమార్ యాదవ్
ముంబైలోని ఆర్.ఏ పొద్దార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కళాశాలలో సూర్యకుమార్ యాదవ్ బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 19 ఏళ్ల దేవీషా శెట్టి అప్పుడే ఇంటర్ పూర్తి చేసి అదే కళాశాలలో చేరింది. అప్పటికే సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఫ్రెషర్స్ పార్టీలో దేవీషాను సూర్య కుమార్ యాదవ్ చూడడం.. అనంతరం ఆమె మైదానంలో సూర్యను చూడటం రెండూ జరిగిపోయాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ స్నేహితుడి ద్వారా సూర్య దేవీషాకు పరిచయమయ్యాడు. సగటు యువతీ యువకుల లాగే కాలేజీ బయట కలుసుకోవడం, మాట్లాడుకోవడం షురూ అయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా మరింత దగ్గరయ్యారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. అలా నాలుగేళ్ల పాటు వారి ప్రేమాయణం సాగింది. వారు మే 2016లో అధికారికంగా నిశ్చితార్థం చేసుకోవడం ద్వారా వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.

జులై 2016లో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, దేవీషా శెట్టి దక్షిణ భారత సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. దేవీషా శెట్టి కాంజీవరం చీర కట్టుకుని బంగారు ఆభరణాలతో చాలా అందంగా కనిపించిది. సూర్యకుమార్ యాదవ్ సాంప్రదాయ దక్షిణ భారత దుస్తులు లుంగీ, చొక్కా ధరించి చాలా అందంగా కనిపించాడు. వీరి వివాహానికి క్రికెట్ ప్రపంచం నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

Story first published: Saturday, April 5, 2025, 15:00 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+