Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Suryakumar Yadav: డివిలియర్స్ కనీసం ఊహించని షాట్లు.. సూరీడు ఆడేస్తున్నాడట!

క్రికెట్‌లో 'మిస్టర్ 360' అనగానే అందరికీ చటుక్కున గుర్తొచ్చే పేరు ఏబీ డివిలియర్స్. ఈ సౌతాఫ్రికా స్టార్ తన కెరీర్‌లో ఎన్నో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. అంతేకాదు, మైదానం అన్ని వైపులా షాట్లు ఆడగలిగే సత్తా డివిలియర్స్ సొంతం. అందుకే అందరూ అతన్ని ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుస్తారు. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. మళ్లీ అంతటి ప్లేయర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూశారు.

వారందరికీ సమాధానంగా దొరికిన ప్లేయర్ టీమిండియా నయా స్టార్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఉన్న సూర్య కూడా డివిలియర్స్‌లాగే మైదానం అన్ని వైపులా భారీ షాట్లు ఆడుతున్నాడు. దీంతో చాలామంది వీళ్లిద్దరి మధ్య పోలికలు తీసుకొస్తున్నారు. దీనిపై స్పందించిన డివిలియర్స్.. సూర్య ఆటతీరును తెగ మెచ్చుకున్నాడు. తను ఆడని ఎన్నో షాట్లు సూర్య ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు.

AB de Villiers Suryakumar Yadav

'సూర్యకుమార్ వద్ద ఎన్నో రకాల షాట్లు ఉన్నాయి. నేను ఆడే సమయంలో కనీసం అటెంప్ట్ చేయని షాట్లు కూడా సూర్య ఆడేస్తున్నాడు. మంచి ఫ్లోలో ఆడుతుండగా సూర్య ఆట చూడటం చెప్పుకోలేని ఆనందాన్నిస్తుంది' అని డివిలియర్స్ చెప్పాడు. సూర్య కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు, క్రీజులో చాలా నిదానంగా మూవ్ అవుతూ అనుకున్న షాట్ ఆడేందుకు పర్‌ఫెక్ట్‌గా రెడీ అవుతాడని కొనియాడాడు.

'ఒక్కసారి ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు. బౌలర్ వేగం పెరిగేకొద్దీ అంత లేట్‌గా ఆడాలని బ్యాటర్‌కు అర్థమైతే అతన్ని ఆపడం కష్టం. సూర్య విషయంలో అదే జరుగుతోంది. అతను ఆ కోడ్ బ్రేక్ చేశాడు' అని డివిలియర్స్ చెప్పాడు. ప్రస్తుతం టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. 46 టీ20 ఇన్నింగ్సుల్లో 175.76 స్ట్రైక్ రేటుతో చెలరేగాడు. వీటిలో 13 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి.

Story first published: Monday, July 3, 2023, 22:26 [IST]
Other articles published on Jul 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+