
భారత స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో మరో స్థిరమైన ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (861 రేటింగ్ పాయింట్లు)లో T20I బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ (838 రేటింగ్ పాయింట్లు)తో రెండో స్థానానికి చేరుకున్నాడు.
బాబర్ ఆజం
సూర్యకుమార్ యాదవ్ కు అతని కెరీర్ లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఇక భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 13 స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 15, రోహిత శర్మ 16వ స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్, న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వేను వెనక్కి నెట్టి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ రైట్-హ్యాండర్ గ్లెన్ ఫిలిప్స్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ట్రై-సిరీస్ మంచి ప్రతిభ కనబరిచి 13 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా కూడా 173 రేటింగ్ పాయింట్లతో T20I ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో స్థిరంగా ఉన్నాడు. మొదటి స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీని రెండో స్థానానికి దిగజారాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా సీమర్ జోష్ హేజిల్‌వుడ్ (705 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (696), శ్రీలంక ట్వీకర్ వనిందు హసరంగా (692), దక్షిణాఫ్రికా వెటరన్ తబ్రైజ్ షమ్సీ (688) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత త్రయం భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ వరుసగా 12, 22, 23 స్థానాల్లో ఉన్నారు.