Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డబ్బుతో ప్రేమతో పేరంట్స్‌కు ఓ ఖరీదైన కారు

Suryakumar Yadav gets emotional as he gives a lovely gift to his parents

హైదరాబాద్: సూర్యకుమార్ యాదవ్... ఈ ఏడాది ఐపీఎల్‌లో బాగారాణించిన ఆటగాళ్లలో ఒకడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సూర్యకుమార్‌ యాదవ్‌ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.3.02 కోట్లకు దక్కించుకుంది.

వేలంలో తనకు వచ్చిన డబ్బుతో సూర్యకుమార్ యాదవ్ ఓ కారు కొనుగోలు చేశాడు. అయితే, ఈ కారు తన కోసం కాదు, తాను కొన్న కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారును అమ్మానాన్నల కోసం కొనుగోలు చేసినట్లు సూర్యకుమార్‌ తెలిపాడు. ఇదొక ఎమోషనల్ మూమెంట్‌ అని అన్నాడు.

'ఇదో ఎమోషనల్ మూమెంట్‌. ఇది నేను కొన్న మొదటి కారు. కానీ, ఇది నా కోసం కాదు. నేను కొన్న మొదటి కారును అమ్మానాన్నలకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ రోజు నేను మీ ముందు ఉండటానికి కారణం వారే. అందుకే వారికి నా కానుక. ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా. లవ్‌ యూ మామ్‌ అండ్‌ డాడ్‌' అని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

ఐపీఎల్ 2018 సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్‌ 521 పరుగులు చేశాడు. ఈ సీజన్ మొదట్లో మిడిలార్డర్‌లో వచ్చిన సూర్యకుమార్‌ ఆ తర్వాత టాప్‌ ఆర్డర్‌లో వచ్చి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించాడు.

భారత్‌ తరఫున ఆన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఓ ఐపీఎల్‌ సీజన్‌లో 500లకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన రికార్డు సాధించాడు.

Story first published: Friday, June 8, 2018, 19:10 [IST]
Other articles published on Jun 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+