
నిలకడ బ్యాటింగ్..
రోజుల తరబడి నిలకడగా రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. బ్యాటింగ్‌లో దూకుడు చూపిస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతుంటాడు. 112 మ్యాచ్‌ల తరువాత కూడా అతని యావరేజ్ స్ట్రైక్ రేట్ 134.03గా ఉందంటే.. అతను ఏ రేంజ్‌లో ఆడుతుంటాడో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్‌లో నిలకడ, బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే అతని వైఖరి నచ్చడం వల్లే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అందరూ కలలు గనే టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.

జోరు తగ్గిన యాదవ్..
టీమిండియాలో అతని చోటు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్‌లో సూర్యకుమార్ యాదవ్‌లో జోరు తగ్గింది. నిస్సారంగా తయారయ్యాడతను. బ్యాటింగ్‌లో ఇదివరకటి మెరుపులు మెరిపించట్లేదు. ఆ దూకుడు కనిపించనూ లేదు. వరుస వైఫల్యాలను చవి చూస్తున్నాడు. క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోతున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతుల్లోనే పెవిలియన్‌కు వెనుదిరుగుతున్నాడు.

చివరి నాలుగు మ్యాచుల్లో..
ఐపీఎల్ 2021 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ తాను ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. హ్యాట్రిక్ పరాజయాల తరువాత ఓ గెలుపును అందుకుంది రోహిత్ సేన. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. అయిదో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్ టీమ్‌ను 135 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన రోహిత్ సేన.. ఒక ఓవర్ ఇంకా మిగిలి ఉండగానే నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

స్వల్ప లక్ష్యానికే..
136 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడానికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లను కోల్పోవాల్సి రావడం, మ్యాచ్‌ను చివరి ఓవర్ల వరకూ తీసుకెళ్లడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకట్లా ఆడే ముంబై ఇండియన్స్ అయివుంటే- ఈ లక్ష్యం ఓ లెక్కే కాదు. ఊది అవతల పడేసి ఉండేది. బ్యాట్స్‌మెన్స్ సత్తా చాటకపోతోండటం వల్ల బ్యాటింగ్‌లో తడబడుతోంది. అటు భారీ స్కోర్‌ను అందుకోలేకపోతోంది. లక్ష్యాన్ని ఛేదించడంలోనూ ఆ జట్టు అడుగులు తడబడుతున్నాయి.

సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్..
ముంబై ఇండియన్స్ కోల్పోయిన ఈ నాలుగింట్లో సూర్యకుమార్ యాదవ్ వికెట్ చుట్టూ పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై. తాను ఎదుర్కొన్న తొలిబంతికే అవుట్ అయ్యాడు. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 16 పరుగులే. పంజాబ్ కింగ్స్ ఏ మాత్రం భారీ స్కోర్ సాధించి ఉన్నా, లేదా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉన్నా విజయం గల్లంతయ్యేదే.

నాలుగో మ్యాచ్‌లో ఫ్లాప్ షో
తాను ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో సూర్యకుమార్ యాదవ్ చేసిన పరుగులు.. 16. ఇది చాలు అతని బ్యాటింగ్ ఎంత అధ్వాన్నంగా తయారైందో చెప్పడానికి. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోల్‌కత నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో అతను చేసింది అయిదు పరుగులే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్‌లో ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో.. జీరో. ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతి టర్న్ తీసుకుంది. దాన్ని అంచనా వేయలేక పోయాడు. నేరుగా మిడిల్ స్టంప్స్ ముద్దాడిందా బాల్.

స్థానం కోల్పోక తప్పదా?
అక్టోబర్ 17వ తేదీన ఆరంభం కాబోయే టీ20 ప్రపంచకప్ జాతీయ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కింది. అతని వరుస వైఫల్యాలు అతని స్థానానికి ఎసరు పెట్టినట్టే. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అధ్వాన్నంగా ఆడుతుండటంతో ఈ ముగ్గురిని రీప్లేస్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. అందివచ్చిన అద్భుత అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్.. చేతులారా కోల్పోతున్నట్టేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications












