
స్టాండింగ్ ఓవేషన్..
డ్రేక్స్ వేసిన 19వ ఓవర్లో సూర్య భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డగౌట్లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ సూర్యను అభినందించారు. 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లతో, 2 సిక్స్‌లతో 35) కలిసి సూర్య.. 37 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో అతన్ని ఇన్నింగ్స్‌ను అందరూ ప్రత్యేకంగా అభినందించారు.
— Sports Hustle (SportsHustle3) February 20, 2022 |
దంచి కొట్టి.. దండం పెట్టిండు..
ఇది గమనించిన సూర్య.. సింపుల్‌గా దండం పెడుతూ తన హాఫ్ సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సూర్య వెరైటీ సెలెబ్రేషన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. దంచి కొట్టి.. దండం పెడుతున్నావ్ కదా బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనేమోనని సూర్యను మెచ్చుకుంటున్నారు. సూర్య సూపరో సూపర్ అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

నోరెళ్ల బెట్టిన పొలార్డ్..
అయితే డ్రేక్స్ బౌలింగ్‌లో సూర్య ఆడిన ఓ సిక్సర్ అయితే అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆఫ్ సైడ్ పడిన బంతిని చాలా ఆలస్యంగా అందుకుంటూ.. బ్యాట్‌ను వికెట్లకు దూరంగా పరిచినట్లు కొట్టిన ఆ షాట్‌కు బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ అద్భుతమైన షాట్‌కు ప్రత్యర్థి కెప్టెన్ పొలార్డ్ కూడా చప్పట్లతో అభినందించాడంటేనే ఆ సిక్సర్ ఎలా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు షెపర్డ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి మరో నమ్మశక్యం కాని సిక్సర్‌ను కూడా బాదాడు. బంతిని ఏదో చటుక్కున పక్కకు లాగేసినట్లు కొట్టిన షాట్‌కు బంతి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది.

విండీస్ చిత్తు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్, 7 సిక్స్‌లతో 65) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 91 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు.
విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షెఫెర్డ్, చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆ జట్టులో నికోలస్ పూరన్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61) వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదినా ఫలితం లేకపోయింది.