Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. తాను ఆ ట్వీట్ కేవలం అందుకే చేశాడంటా?

Suryakumar Yadav clarified that he admired Ryan Parags attitude only in terms of fielding

ఫీల్డింగ్‌లో రియాన్ పరాగ్ వైఖరిపై సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ స్టార్ సూర్య ఏదో క్యాజువల్‌గా ట్వీట్ చేస్తే.. నెటిజన్లు అసాధారణంగా రియాక్ట్ అయ్యారు. రియాన్ పరాగ్ వైఖరిని మెచ్చుకోవడమేంటీ? అంటూ మండిపడ్డారు. సూర్య భాయ్ నుంచి ఇలాంటి ట్వీట్‌ను ఊహించలేమని, వెంటనే తొలగించాలని కూడా సూచించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో రియాన్ పరాగ్ బౌండరీల వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పటికీ కాస్త నోటి దురుసు ప్రదర్శించాడు.

తన తోటి ప్లేయర్ దేవదత్ పడిక్కల్ మీద సీరియస్ అయ్యాడు. వెంటనే బాల్ అందుకుని వేయ్ అంటూ సీరియస్ గా రియాన్ రియాక్ట్ అయ్యాడు. ఓ పక్క ఈ విషయమై నెటిజన్లు అతని మీద మండిపడుతుంటే.. మరో పక్క సూర్య రియాన్ పరాగ్‌ను పొగడడమేంటో అర్థం కాలేదంటూ నెటిజన్లు తీవ్రంగా సీరియస్ అయ్యారు. ఇక ఈ ట్వీట్ వైరల్ అవడంతో సూర్య మరో ట్వీట్ చేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూశాడు. 'కేవలం అతని ఫీల్డింగ్ కోసమే ఆ ట్వీట్ పెట్టా గాయ్స్.. కాస్త చిల్ కండి' అంటూ ట్వీట్ చేశాడు.

అసలు సూర్య చేసిన వివాదాస్పద ట్వీట్ ఏంటంటే..

ఇక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఆటిట్యూడ్ పై సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. ​​'అమేజింగ్ ఆటిట్యూడ్ ఆన్ ది ఫీల్డ్ #riyanparag #RRvGT" అని పేర్కొన్నాడు. పరాగ్ నిజంగానే అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. రెండు సార్లు బౌండరీ వద్ద డైవ్ చేసి ఫోర్లు పోకుండా కాపాడాడు. అతని ఫీల్డింగ్ పట్ల నిజంగానే కామెంటేటర్లు, సహచరుల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ అతను ఫీల్డింగ్ చేసి కూల్ గా ఉంటే అయిపోయేది. కానీ కాస్త ఓవరాక్షన్ చేశాడు. తాను ఆపిన బంతిని వెంటనే అందుకుని త్రో వేయాలంటూ సహచర క్రికెటర్ల మీదికి రియాన్ సీరియస్ అవ్వడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.

ఈ వివాదానికి మూలం ఇదే

గుజరాత్ ఛేజింగ్ చేస్తున్న టైంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన 16వ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ వైడ్ లాంగ్ ఆన్ వైపు ఓ షాట్ ఆడాడు. ఇక లాంగ్ ఆన్‌లో ఉన్న పరాగ్ అత్యంత వేగంగా పరిగెత్తి స్లిడ్ చేసి బంతిని బౌండరీకి ​​చేరకుండా ఆపాడు. ఇక ఆ బంతిని చేత్తో పట్టుకుంటే బౌండరీకి టచ్ అవుతానేమోనని వెంటనే బాల్ డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకొస్తున్న దేవదత్ పడిక్కల్ వైపు విసిరేశాడు. అతను విసిరేసిన టైంలో ఓ రకంగా ప్రవర్తించాడు. ఏంటలా పెళ్లికి వెళ్తున్నవాడిలా మెల్లగా వస్తావ్.. త్వరగా బాల్ అందుకుని త్రో వేయి అన్నట్లు కోపంగా ప్రవర్తించాడు. వెంటనే దేవదత్ బాల్ అందుకుని కీపర్ వైపు త్రో వేశాడు. ఫలితంగా రెండు రన్స్ సేవ్ అయ్యాయి. కానీ పరాగ్ మాత్రం తనకు కాస్త సీనియర్ అయిన తోటి సహచరుడి పట్ల అలా దురుసుగా ప్రవర్తించడం అభిమానులకు కోపం తెప్పించింది. అలాగే బ్యాటింగ్లోనూ అశ్విన్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అభిమానులు సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వని రియాన్ పరాగ్‌ను సూర్య మెచ్చుకోవడం ఏంటని ట్వీట్లు పెట్టారు.

ఆలోచించి ట్వీట్ చేయాలంటూ సూర్యకుమార్‌పై మండిపాటు

రియాన్ పరాగ్ ఆటిట్యూడ్ ఫీల్డింగ్లో బాగుందంటూ సూర్యకుమార్ ట్వీట్ చేయడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఏంటీ సూర్య నువ్వు కూడా మద్దతిస్తావ్. సీనియర్ల మీదికి రెచ్చిపోయే ప్లేయర్ ను మెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ హితబోధ చేశాడు. ఇలా మెచ్చుకుంటూ పోతే పరాగ్ లాంటి ప్లేయర్లు మరింత ఓవర్ చేస్తారు అంటూ ఇన్నర్ మీనింగ్ తో ట్వీట్ చేశాడు. ఇంకొందరు ఇలాంటి ట్వీట్లు పెట్టకు సూర్య బ్రో.. డిలీట్ చేయ్. ఎందుకు అనవసరంగా ట్రోల్ కు గురవుతావ్ అంటూ సూచిస్తున్నారు. ఇక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్‌ను 7వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్ టైటాన్స్ సగర్వంగా ప్లేఆఫ్ చేరిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, May 26, 2022, 19:13 [IST]
Other articles published on May 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+