హిస్టరీ క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. పొట్టి ఫార్మాట్‌లో విశ్వరూపమే..!

ప్రస్తుతం టీమిండియాలో ఎవరూ అందుకోలేనంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అంటే సూర్యకుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది. భారత జట్టుకు ఎంపికైనప్పటి నుంచి సత్తా చాటుతూ వస్తున్న సూర్య.. ఈ ఏడాది ఆరంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో ఒక్క ఏడాదిలో వెయ్యి పైగా పరుగులు చేసిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

అసలు సిసలు టీ20 స్పెషలిస్ట్
టీ20 క్రికెట్‌లో తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. వన్డేలు, టెస్టుల్లా క్రీజులో కుదురుకోవడానికి టైం తీసుకోవడానికి ఉండదు. అందుకే అందరు బ్యాటర్లు ఈ ఫార్మాట్‌కు సరిపోరు. కానీ సూర్యకుమార్ యాదవ్ అలాక్కాదు. అతని ఆటతీరు పొట్టి ఫార్మాట్ కోసమే పుట్టినట్లు ఉంటుంది. తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం స్కై స్పెషాలిటీ.

పొట్టి ఫార్మాట్‌లో విశ్వరూపం..
ఈ ఏడాది ఆరంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో రెచ్చిపోయాడు. ఇంగ్లిష్ గడ్డపైనే ఈ ఫార్మాట్‌లో తన తొలి శతకం నమోదు చేశాడు. కేవలం 48 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. సూర్య సత్తా ఎలాంటిదో అందరికీ తెలిసొచ్చింది. ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్‌లో కూడా రాణించాడు. ఆసియా కప్‌తోపాటు స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన సిరీసుల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

చరిత్ర సృష్టించిన స్కై..
టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. కీలకమైనఇన్నింగ్సులు ఆడుతున్నాడు. సౌతాఫ్రికాపై భారత్ ఓడినా కూడా ఆ మ్యాచ్‌లో సూర్య ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. అలాగే తాజాగా జింబాబ్వేపై కూడా అద్భుతంగా ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలోనే ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000పైగా టీ20 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాదిలో సూర్య మొత్తం 1002 పరుగులు సాధించడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications