
జడ్డూ ఆడతాడా?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సిరీస్ ఆడతాడా? లేదా? అనే అంశంపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన బృందంలో రవీంద్ర జడేజాను పేరు కూడా ఉంది. అతనితోపాటు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు స్పిన్నర్ల విభాగంలో ఉన్నారు. అయితే మోకాలి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జడ్డూ ఈ సిరీస్ నాటికి ఫిట్‌గా ఉంటాడా? అనేది అనుమానంగా మారింది. దీనిపై బీసీసీఐ కూడా స్పందిస్తూ.. జడేజా ఫిట్‌నెస్‌ను బట్టి అతను ఈ సిరీస్ ఆడతాడా? లేదా? అనేది నిర్ణయిస్తామని తెలిపింది.

సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌కు ఛాన్స్
ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు తొలిసారి టెస్టు జట్టు నుంచి పిలుపొచ్చింది. టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ముంబై తరఫున రంజీ ట్రోఫీలో కూడా రాణించిన సంగతి తెలిసిందే. అలాగే బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ చేసిన తర్వాత జార్ఖండ్ తరఫున రంజీలు ఆడిన ఇషాన్ కూడా అద్భుతంగా రాణించాడు. దీంతో వీళ్లిద్దరికీ టెస్టు జట్టులో కూడా చోటు ఇవ్వాలని సెలెక్టర్లు భావించారు. అయితే పంత్ స్థానంలో కిషన్‌ను ఆడించాలని కొందరు మాజీలు సూచనలు చేసిన క్రమంలో.. కేెఎస్ భరత్‌ను పక్కన పెట్టి కిషాన్‌ను ఆడిస్తారేమో చూడాలి.

భారత జట్టు ఇదే..
ఆస్ట్రేలియాతో టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో నలుగురు పేసర్లకు సెలెక్టర్లు చోటిచ్చారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్‌తోపాటు దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తున్న జయదేవ్ ఉనద్కత్‌ను కూడా ఎంపిక చేశారు. శార్దూల్ ఠాకూర్ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లను మాత్రం టెస్టులకు పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. వెన్నునొప్పితో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ సమయానికి కూడా జట్టుతో కలవడం లేదు. ఈ రెండు టెస్టులు ముగిసిన తర్వాత అతను జట్టుతో కలుస్తాడేమో చూడాలి.
భారత బృందం: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్
(ఫిట్‌గా ఉంటేనే రవీంద్ర జడేజా ఈ బృందంతో కలుస్తాడు)


Click it and Unblock the Notifications
