Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: టీ20 క్రికెట్‌‌లో సూర్యకుమార్ యాదవ్ భారీ రికార్డు

IPL 2025: ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్ లో భారీ ఘనత సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్‌లో 8వేల పరుగులు దాటాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఈ మైలురాయిని వేగంగా చేరుకున్న రెండో బ్యాటర్ కావడం గమనార్హం. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దాని ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

8వేల పరుగులను వేగంగా చేరుకున్న రెండో ఆటగాడు
ఐపీఎల్ 2025లో టీ20 క్రికెట్ లో 8వేల పరుగుల మైలురాయిని వేగంగా చేరుకున్న రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 2598 పరుగులు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లలో మాత్రమే సూర్యకుమార్ యాదవ్ 3698 పరుగులు చేశాడు. ఇది కాకుండా దేశీయ మ్యాచ్‌లలో కూడా పరుగులు సాధించాడు. మొత్తం మీద సూర్యకుమార్ యాదవ్ 288 టీ20 మ్యాచ్ లలో 8007 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 54 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Suryakumar Yadav Achieves Milestone of 8 000 T20 Runs

ప్రపంచ స్థాయిలో ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న టీ20 బ్యాటర్ ఆండ్రీ రస్సెల్. రస్సెల్ 4749 బంతుల్లో 8000 టీ20 పరుగులను దాటాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు 5256 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అంతే కాకుండా టీ20ల్లో 8000 పరుగులు సాధించిన 5వ భారత ఆటగాడిగా నిలిచాడు.

టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
12976 - విరాట్ కోహ్లీ
11851 - రోహిత్ శర్మ
9797 - శిఖర్ ధావన్
8654 - సురేష్ రైనా
8007 - సూర్యకుమార్ యాదవ్*

ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 116 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత ముంబై ఇండియన్స్ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 13 పరుగులకు ఔట్ అయ్యాడు. విల్ జాక్స్ 16 పరుగులకు ఔట్ అయ్యాడు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ ముంబై తరఫున అద్భుతంగా ఆడారు. ర్యాన్ రికెల్టన్ 41 బంతుల్లో 62 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ కేవలం 9 బంతుల్లో 27 పరుగులు చేసి ముప్పుతిప్పలు పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు.

Story first published: Tuesday, April 1, 2025, 9:04 [IST]
Other articles published on Apr 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+