Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన సూర్య: రోహిత్ రికార్డు సమం

ఐపీఎల్-2024 సీజన్ ఆఖర్లో ముంబై ఇండియన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల ఓటమి అనంతరం విజయాన్ని సాధించింది. వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ముంబై నెగ్గింది. నెట్‌రన్‌రేటును మెరుగుపర్చుకుని అట్టడుగున నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48; 30 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్. కెప్టెన్ కమిన్స్ (35*; 17 బంతుల్లో, 2x4, 2x6) కీలక పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య (3/31), పీయూష్ చావ్లా (3/33) మూడు వికెట్లు తీశారు.

Suryakumar Yadav Achieves Milestone Most IPL Hundreds for Mumbai Indians

అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అయితే ముంబై 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ (37*; 32 బంతుల్లో, 6x4)తో కలిసి సూర్యకుమాయర్ యాదవ్ (102*; 51 బంతుల్లో, 12x4, 6x6) ముంబైని గెలిపించాడు. అజేయ శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో సూర్య అరుదైన ఘనతలు సాధించాడు.

ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌లో ముంబై తరఫున సూర్య, రోహిత్ రెండు శతకాలు సాధించారు. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, సైమన్స్, కామెరూన్ గ్రీన్ తలో సెంచరీ బాదారు. అంతేగాక సూర్య మరో ఘనత సాధించాడు.

టీ20ల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్‌తో కలిసి సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లి తొమ్మిది సెంచరీలు చేశాడు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఎనిమిది; రుతురాజ్, రాహుల్, సూర్య తలో ఆరు సార్లు శతక్కొట్టారు. ఇక పొట్టి ఫార్మాట్‌లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ మిల్లర్‌ (4)తో కలిసి సూర్య (4) రెండో స్థానంలో నిలిచాడు. టాప్‌లో మాక్స్‌వెల్ (5) ఉన్నాడు.

Story first published: Tuesday, May 7, 2024, 8:33 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+