For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మా కళ్ల ముందే ట్రోఫీ ఎత్తుకెళ్లారు': నఖ్వీపై సూర్య సంచలనం!

ఆసియా కప్ 2025 ముగిసినా దాని చుట్టూ అలుముకున్న వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించి విజయం సాధించిన తర్వాత ట్రోఫీ ప్రదానోత్సవంలో జరిగిన డ్రామాపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించారు. తన కళ్లెదుటే పీసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం తాను చూశానని సూర్య కుమార్ యాదవ్ ఆరోపించారు.

ఫైనల్ రాత్రి ఏం జరిగిందంటే..
పాకిస్తాన్‌పై భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకున్న తర్వాత పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా హైడ్రామా నడిచింది. పీసీబీ అధ్యక్షుడు, పాకిస్థాన్ మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. మొదట్లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-ఛైర్మన్ ఖాలిద్ అల్ జరూనీ అవార్డులు ఇస్తారని అనుకున్నారు. కానీ పాకిస్తాన్ ఆటగాళ్లకు మెడల్స్, రన్నరప్ చెక్ అందిన తర్వాత కామెంటేటర్ సైమన్ డూల్ భారత జట్టు ట్రోఫీ తీసుకోదని ప్రకటించారు. ఈలోగా నఖ్వీ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. వివాదాస్పద పరిస్థితుల మధ్య భారత జట్టు ట్రోఫీ లేకుండానే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.

Suryakumar Yadav Accuses PCB Chief Mohsin Naqvi of Fleeing with Asia Cup Trophy

'ట్రోఫీ పట్టుకుని పారిపోయారు'
మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. మ్యాచ్ తర్వాత జరిగిన గందరగోళాన్ని వివరించారు. బీసీసీఐ లేదా భారత ప్రభుత్వం నుంచి తమకు ట్రోఫీని స్వీకరించకూడదని ఎటువంటి ఆదేశాలు రాలేదని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. "ట్రోఫీ ఎవరైనా ఇస్తే తీసుకోకూడదని మాకు ఎవరూ చెప్పలేదు. మైదానంలో మా జట్టుగా మేమే ఆ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన తెలిపారు. "మేము డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చోలేదు. అవార్డుల కోసం ఎవరినీ వేచి చూడమని చెప్పలేదు. నేను చూసింది ఏంటంటే, వారు ట్రోఫీ తీసుకుని పారిపోయారు. కొంతమంది మా వీడియో తీస్తున్నారు, కానీ మేము అక్కడే నిలబడి ఉన్నాం, లోపలికి వెళ్లలేదు" అని మొహ్సిన్ నఖ్వీ తీరును పరోక్షంగా ఎత్తిచూపారు.

"ఏసీసీ అధికారులు వేదికపై నిలబడి ఉన్నారు, మేము కింద ఉన్నాం. వారు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ప్రేక్షకులు కొందరు హూటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత, వాళ్ల మనిషి ఎవరో ట్రోఫీ తీసుకుని పారిపోవడం మేము చూశాం" అని సూర్యకుమార్ యాదవ్ వివరించారు.

బీసీసీఐ చర్యలు
ఈ వివాదంపై బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఐసీసీ మీటింగ్‌లో మొహ్సిన్ నఖ్వీ ప్రవర్తనపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

Story first published: Tuesday, September 30, 2025, 9:42 [IST]
Other articles published on Sep 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+