T20 World Cup 2022: నవ్వులు పూయించిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో చూస్తే మీరు కూడా..

ఆస్ట్రేలియా, ఇండియా వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఓ హాస్యకర ఘటన జరిగింది. సోమవారం గబ్బాలో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా పేసర్ రిచర్డ్‌సన్ కు మధ్య ఇది జరిగింది. రిచర్డ్‌సన్ ఈ మ్యాచ్ చివరి ఓవర్ వేశాడు. అతని బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ విచిత్రంగా ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నవ్వులు
రిచర్డ్‌సన్ ఫుల్ టాస్ బాల్ వేయగా సూర్యకుమార్ దానిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అక్కడే పైకి లేచింది. వెంటనే రిచర్డ్‌సన్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత రిచర్డ్‌సన్ చేతితో నోటికి అడ్డం పెట్టుకుని నవ్వాడు. ఔటయిన సూర్యకుమార్ యాదవ్ కూడా నవ్వుకుంటూ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 50 పగులు చేశాడు. రిచర్డ్‌సన్ 4 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అత్యుత్తమ ఆటగాడు
" అతనికి బ్యాట్ షాట్ మిస్ అవడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటున్నాను. సూర్యాకుమార్ యాదవ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు." అని రిచర్డ్‌సన్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్ భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను చివరి ఓవర్లో మహ్మద్ షమీ దెబ్బ కొట్టాడు. అతను ఒక ఓవర్ వేసి మూడు వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications