Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వచ్చే టీ20 ప్రపంచకప్‌లో మోస్ట్ డేంజరేస్ ప్లేయర్ అతనే : ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్

Suryakumar Is The Most Dangerous Player for Upcoming T20 World cup Says Aussies Coach Mcdonald

టీ20 ప్రపంచకప్ 2022లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అత్యంత డేంజరేస్ ప్లేయర్ అని ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మూడో టీ20 అనంతరం మెక్ డొనాల్డ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. మూడో టీ20లో 187పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించడంలో విరాట్ కోహ్లీతో కలిసి 104పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సూర్య.. ఎడాపెడా సిక్సులు బాదుతూ ఆసీస్ బౌలర్ల లయ దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అతని (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సులు) ఇన్నింగ్స్ భారత విజయానికి కీలకమైంది.

ఈ విజయం ద్వారా భారత్ 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20సిరీస్‌కు రవీంద్ర జడేజా గైర్హాజరు కావడం భారత్‌ను బలహీనపరుస్తుందని తొలుత మెక్‌డొనాల్డ్ అన్నాడు.. అయితే భారత్‌కు జడేజా లేని లోటు పూర్తిగా తీరిపోయిందని.. అతని స్థానంలో అత్యుత్తమంగా రాణించిన అక్షర్ పటేల్‌ గొప్పగా ఆడాడని కొనియాడు. అక్షర్ పటేల్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. అతను ఈ సిరీస్లో 8వికెట్లు తీయడంతో పాటు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు.

భారత బ్యాటర్ల నైపుణ్యానికి ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ సరిపోలేదని మెక్‌డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. 'ఓడిపోయాక ఎప్పుడూ డిస్కసన్స్ జరుగుతూనే ఉంటాయి. డెత్ బౌలింగ్‌లో మా జట్టు మెరుగ్గా ఉందా అంటే నేను దానికి అవుననే సమాధానం చెబుతాను. మా ప్లేయర్లు మంచి నిర్ణయాలు తీసుకోవాలని, వాటిని అమలు చేయమని ప్రోత్సహిస్తా. కొన్నిసార్లు బ్యాటర్ నైపుణ్యం కూడా బౌలర్ ప్లాన్స్‌ను చెడగొట్టొచ్చు.

మేము సిరీస్ అంతటా హార్దిక్ విషయంలో మా ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా చూశాం. అయితే సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు అదరగొట్టాడు. అతని నైపుణ్యానికి బౌలర్లు ఒకానొక దశలో ఏం చేయగలరు చెప్పండి. అతను చాలా బెస్ట్ స్టేజులో ఉన్నాడు. అతను టీ20 ప్రపంచకప్‌లో అత్యంత డేంజరేస్ ప్లేయర్ కాబోతున్నాడు. అతను ఏమి చేయగలడో ఈ మ్యాచ్‌లో చూపించాడు' అని మెక్ డొనాల్డ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, September 26, 2022, 13:48 [IST]
Other articles published on Sep 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+