INDvsSL: డివిల్లీర్స్‌ది వేరే రేంజ్.. సూర్యతో పోల్చకూడదు.. బట్లర్ కూడా బెటరే!

టీమిండియా నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడో మాజీ క్రికెటర్. సూర్యను డివిల్లీర్స్, జోస్ బట్లర్ వంటి వారితో పోల్చకూడదన్నాడు. సూర్యతో పోలిస్తే మిగతా ఇద్దరూ ఒక అడుగు ముందే ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.

సూర్య కన్నా డివిల్లీర్స్ బెటర్?
సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి ఆటగాడే కానీ.. డివిల్లీర్స్, బట్లర్ చాలా బలమైన ఆటగాళ్లని పఠాన్ వివరించాడు. 'సూర్య చాలా గొప్ప ఆటగాడు. కానీ అతన్ని డివిల్లీర్స్‌తో పోల్చకూడదు. ఆ మాటకొస్తే బట్లర్‌తో కూడా పోల్చకూడదు. ఎందుకంటే డివిల్లీర్స్, బట్లర్ ఇద్దరి పవర్ గేమ్ వేరే రేంజ్‌లో ఉంటుంది. వాళ్లు లాంగాఫ్, కవర్స్ మీదుగా కొట్టే షాట్లు చూస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అదే సమయంలో సూర్యకుమార్ వద్ద చాలా రకాల షాట్లు ఉన్నాయి. ఆ విషయం కూడా ఒప్పుకోవాల్సిందే' అని పఠాన్ చెప్పాడు.

ఆ స్థానంలో సూర్యనే బెస్ట్..
డివిల్లీర్స్ ఎక్కువగా లాంగాఫ్, కవర్స్ మీదుగా భారీ షాట్లు ఆడతాడని చెప్పిన పఠాన్.. అదే పవర్ గేమ్ అని చెప్పాడు. 'ఇక బట్లర్ గురించి మాట్లాడితే.. అతను డివిల్లీర్స్ కన్నా ఎక్కువ బలమైన షాట్లు ఆడతాడు. అదే ఆడే రేంజ్ చూశామనుకో.. సూర్యది పెద్ద రేంజ్. తను కవర్స్ మీదుగా ఆడతాడు. అలాగే మిడ్ వికెట్ మీదుగా కూడా ఆడగలడు. కట్ షాట్, స్వీప్ అన్నీ ఆడే ట్యాలెంట్ అతనికి ఉంది. అంతేకాదు, సూర్య తన స్వీప్ షాట్‌ను రెండు రకాలుగా ఆడతాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. సూర్య దగ్గర మంచి రేంజ్ ఉన్నా అంత పవర్ లేదు. మిడిల్ ఓవర్లలో అతని కన్నా బెటర్ బ్యాటర్ ప్రపంచంలో ఇంకెవరూ లేరు' అని తేల్చిచెప్పాడు.

సూపర్ ఇన్నింగ్స్ వృధా
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో కూడా సూర్యకుమార్ అద్భుతంగా రాణించాడు. కేవలం 36 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. అక్షర్ పటేట్ (65)తో కలిసి ఆరో వికెట్‌కు 91 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 207 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు 190 పరుగుల వద్ద నిలిచిపోయింది. దీంతో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ శనివారం నాడు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications