Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ చేసిన పనికి విస్తుపోయా..! అయిన అది నా మనసును హత్తుకుంది : సూర్యకుమార్ యాదవ్

Surya Kumra Yadav Reaction About Virat Kohli Gesture Of Take a Bow to Him

హాంకాంగ్‌పై గెలుపుతో ఆసియా‌కప్ - 2022లో సూపర్ ఫోర్ దశకు టీమిండియా చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ స్టార్ అయిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇక విరాట్ కోహ్లీ తనకు టేక్ ఏ బో చెప్పడాన్ని తలుచుకున్న సూర్యకుమార్ అది తన మనస్సును ఎంతగానో హత్తకుందని పేర్కొన్నాడు. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో హాంకాంగ్‌ను 40పరుగుల తేడాతో ఓడించడంలో సూర్యకుమార్ యాదవ్ 68నాటౌట్, విరాట్ కోహ్లీ 59నాటౌట్ బ్యాటింగ్లో కీలక పాత్ర పోషించగా.. రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్ వల్ల హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ రనౌట్ కావడం కూడా మ్యాచ్ మలుపుతిప్పింది. ఇప్పటికే ఆప్ఘాన్ సూపర్ 4దశకు చేరుకుంది. ఇకపోతే బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్, హాంకాంగ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు నాకౌట్ మ్యాచ్‌లుగా మారాయి. ఈ రెండు మ్యాచ్‌లలో ఏ జట్లు గెలిస్తే ఆ జట్లు సూపర్ 4 దశకు చేరుకుంటాయి.

బ్రో మనం మనం ఒకటి.. కలిసి వెళ్దాం పదా

ఇన్నింగ్స్ ముగిశాక సూర్యకుమార్‌కు విరాట్ కోహ్లీ వంగి టేక్ ఏ బో చెప్పడంతో కాస్త విస్తుపోయానని సూర్య అన్నాడు. ' నాకు విరాట్ కోహ్లీ టేక్ ఏ బో చెప్పడం ఓ హృదయపూర్వక సంజ్ఞ. ఎందుకంటే నేను ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు. కోహ్లీ నిల్చుండి నాకు బో చెప్పడం చూసి అయ్యో బ్రో మనం మనం ఒకటి చలో కలిసి పదా అన్నాను. కోహ్లీకి చాలా అనుభవం ఉంది.. నేను అతనితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని చాలా ఆనందించాను. మ్యాచ్‌లో ఎవరైనా అనుభవజ్ఞులు నిలదొక్కుకోవడం ముఖ్యం. ఎందుకంటే నేను ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు' అని సూర్యకుమార్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అన్నాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ మెరుపులకు హాంకాంగ్ బౌలర్ల వద్ద ఎలాంటి సమాధానం లేకుండా పోయింది. కేవలం 22బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన సూర్య చివరి ఓవర్‌లో నాలుగు సిక్సర్లతో 26 పరుగులు పిండుకుని భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు.

నువ్వే ఎక్స్ ప్రెస్‌లా ఆడాలన్నాడు

సూర్యకుమార్ తన నాక్ గురించి మాట్లాడుతూ.. 'నేను క్రీజులోకి వెళ్లి వేగంగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్టింగ్‌లో వికెట్ కాస్త స్లో అయినందున.. నేను విరాట్ కోహ్లీతో మాట్లాడాను.. అతను 'నువ్వే ఎక్స్‌ప్రెస్‌లా మారి బ్యాటింగ్‌కు అనుకూలంగా చేయాలి అని చెప్పాడు. అయితే ఎలా బ్యాటింగ్ చేయాలో కూడా నాకు చాలా స్పష్టమైన ప్లాన్ ఉంది. నేను అనుకున్నట్లే దాన్ని కొనసాగించాను' అన్నాడు. అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ భారీగా పరుగులు ఇవ్వడం గురించి విలేకరులు అడగగా.. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'నా ప్రకారం.. వాళ్లు అంత చెడ్డగా బౌలింగ్ చేయలేదు. ఇద్దరి బౌలింగ్ పర్వాలేదు. అందరూ రాణిస్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రతి బౌలర్‌ ఒకానొక టైంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు' అని చెప్పాడు.

రాహుల్‌ను వెనకేసుకొచ్చిన సూర్య

'ఎలాంటి పరిస్థితులు వస్తే ఎలా బ్యాటింగ్ చేయాలనేది మేం తరచూ చర్చించుకుంటున్నాం. మేము తొలుత బ్యాటింగ్ చేస్తే 170-180 ప్లస్ స్కోర్ చేయాల్సిన ప్లాన్ల గురించి చూస్తున్నాం. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సవాల్‌గా భావిస్తున్నా. మేం దేనికైనా సిద్ధంగా ఉండాలి. నేను నా షాట్లను ప్లాన్ చేసుకుంటాను. ఇకపోతే మేము హాంకాంగ్‌ను ఎక్కువ తేడాతో ఓడించాలని చూశాం. కానీ హాంకాంగ్ కాస్త బెటర్ ప్రదర్శన ఇచ్చింది. నన్ను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలని అడిగినా నేను దానికి సిద్ధమని, అదే నేను కోచ్‌తో చెప్పాను' అని సూర్య చెప్పాడు. ఇకపోతే కేఎల్ రాహుల్ పూర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. తనకు నేను అడ్వైజ్ ఇచ్చేవాణ్ని కాను.. అయితే ఓ విషయం గుర్తుంచుకోవాలి గాయంతో గానీ, ఇతర సమస్యలతో గానీ చాలా కాలం జట్టుకు దూరమై మళ్లీ పునరాగమనం చేసినప్పుడు కొంత టచ్ కోల్పోవడం సహజమే. మళ్లీ కేఎల్ రాహుల్ తన ఆటను కనబర్చుతాడు' అంటూ సూర్య వెనకేసుకొచ్చాడు.

Story first published: Thursday, September 1, 2022, 10:50 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+