Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Surya Kumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ.. ఈ కీలక సిరీస్‌కు కూడా దూరం కానున్నాడా?

Surya Kumar Yadav: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొంతకాలం స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సూర్య ఆస్పత్రి నుంచి ఒక ఫోటోను షేర్ చేశాడు. తాను ఒక సర్జరీ చేయించుకున్నట్లు ఆ పోస్టులో సూర్యకుమార్ యాదవ్ స్వయంగా తెలిపాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ కొంతకాలం పాటు ఆట నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది.

సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ
34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. అక్కడ సూర్యకుమార్ యాదవ్‌కు స్పోర్ట్స్ హెర్నియా కోసం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని సూర్య తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. శస్త్రచికిత్స సజావుగా జరిగిందని.. తాను ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సూర్య పేర్కొన్నాడు. తన ఆరోగ్య స్థితి గురించి సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పంచుకుంటూ.."నాకు స్పోర్ట్స్ హెర్నియాకు సంబంధించి కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ సాఫీగా పూర్తి అయినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. మళ్లీ మైదానంలోకి తిరిగి రావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని సూర్యకుమార్ యాదవ్ తన పోస్టులో వెల్లడించాడు. ఇటీవలే ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు.

Surya Kumar Yadav Undergoes Surgery Doubtful for Bangladesh Tour

బంగ్లాదేశ్ పర్యటనకు దూరం?
రోహిత్ శర్మ తర్వాత బీసీసీఐ టీ20 జట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. సర్జరీ కారణంగా సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సూర్య పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 12 వారాలు పట్టవచ్చు. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ఒక ముఖ్యమైన ఆటగాడు. టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ అనేక అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంది. అక్కడ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల టెస్ట్ జరుగుతోంది. దీని తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది. బంగ్లాదేశ్‌లో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడతారు. మొదటి టీ20 మ్యాచ్ ఆగస్టు 26న, చివరి మ్యాచ్ ఆగస్టు 31న జరుగుతుంది.

సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. సూర్య కుమార్ యాదవ్ ఒక టెస్ట్, 37 వన్డేలు, 83 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలలో 773 పరుగులు, టీ20లలో 2598 పరుగులు చేశాడు. వన్డేలలో 4 అర్థ సెంచరీలు సాధించాడు కానీ సెంచరీ చేయలేదు. టీ20లలో 4 సెంచరీలు, 21 అర్థ సెంచరీలు చేశాడు.

Story first published: Thursday, June 26, 2025, 10:09 [IST]
Other articles published on Jun 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+