
బ్రాండన్ కింగ్ చెలరేగడంతో..
టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ పర్వాలేదనిపించేలా ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్ కైల్ మేయర్స్ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు 73) తొలుత నెమ్మదిగా ఆడినా తర్వాత చెలరేగాడు. బ్రాండన్ కింగ్ (20 బంతుల్లో 20)తో కలిసి 57పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. తర్వాత కెప్టెన్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో స్కోరు కాస్త నెమ్మదించింది. కుదురుకున్నాక వీరిద్దరూ బౌండరీలు బాదారు. పూరన్ (23 బంతుల్లో 22), మేయర్స్ ఔటయినా.. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 23), హెట్‌మైర్ (12 బంతుల్లో 2సిక్సర్లతో 20) ధాటిగా ఆడడంతో విండీస్ 4వికెట్లు కోల్పోయి 164పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ 2, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ చెరో వికెట్ తీశారు.

డ్యాన్సింగ్ మూమెంట్లతో దంచికొట్టిన సూర్య
తర్వాత ఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభం అదిరిపోయింది. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది సూర్య తన దాడి మొదలెట్టాడు. రెండో ఓవర్లో రోహిత్ సైతం సిక్స్, ఫోర్ కొట్టి టచ్‌లో కన్పించాడు. కానీ అనూహ్యంగా వెన్ను గాయంతో అతను మధ్యలోనే క్రీజు వీడాడు. తర్వాత శ్రేయస్ అయ్యార్‌తో కలిసి స్కై రెచ్చిపోయాడు. తన డ్యాన్సింగ్ మూమెంట్లతో ఫోర్లు, సిక్సులు బాదుతూ అలరించాడు. ఈ క్రమంలో 26బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 86 పరుగుల వీరి భాగస్వామ్యానికి అకెల్ హోసెన్ తెరదించాడు. శ్రేయస్ అయ్యార్‌ను ఔట్ చేశాడు. తర్వాత సూర్య, హార్దిక్ పాండ్యా (4)పరుగులు ఔటయినా దీపక్ హుడా (10)తో కలిసి రిషబ్ పంత్ రాణించి విజయ లాంఛనాన్ని ముగించాడు.

తుది జట్లు
వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (c), షిమ్రాన్ హెట్మెయర్, డెవాన్ థామస్ (WK), రోవ్‌మాన్ పావెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
ఇండియా : రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్


Click it and Unblock the Notifications
