Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: ఉన్నంతసేపు ఊపేశాడు.. 16 బంతుల్లో 30 పరుగులు చేసిన సూర్య..

Surya Kumar Yadav scored 30 runs in 15 balls in the ongoing match against Bangladesh

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అడిలైడ్ లోని ఓవల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఉన్నంత సేపు బౌండరీలు కొట్టే ప్రయత్నం చేశాడు. సూర్య కుమార్ 30 పరుగుల్లో 4 ఫోర్లు ఉన్నాయి. అంతకు ముందు కేఎల్ రాహుల్ ఆఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ గత మ్యాచ్ ల్లో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు.

రోహిత్ శర్మ
కాగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. 8 బంతుల్లో 2 పరుగులు చేసి హసన్ మహమూద్ బౌలింగ్ లో యాసిర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అప్పటికే రోహిత్ శర్మ క్యాచ్ ను బంగ్లా ఫీల్డర్లు మిస్ చేశారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రోహిత్ మళ్లీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.రోహిత్ గత మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 బంతుల్లో 4 పరుగులకే చేశాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులే చేశాడు.

విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగలు చేసిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లి 1040 పరుగులతో మహేళ జయవర్దనేను అధికమించాడు. కోహ్లి 23 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించాడు. కోహ్లి తర్వాత జయవర్దనే, క్రిస్ గేల్, రోహితశర్మ, దిల్షాన్ ఉన్నారు.

Story first published: Wednesday, November 2, 2022, 15:02 [IST]
Other articles published on Nov 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+